Political News

ఎక్క‌డో తేడా కొడుతోంది.. జ‌గ‌న్ శిబిరంలో ద‌డ‌ద‌డ‌!!

ఔను! ఇప్పుడు జ‌గ‌న్ శిబిరంలో ద‌డ‌ద‌డ ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌రుగుతున్న ప‌రిణామా లు.. జ‌గ‌న్ శిబిరంలోని కీల‌క నాయ‌కుల‌కు కంటిపై కునుకు క‌రువైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైనాట్ 175 అన్న నాయ‌కులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. నిజానికి 2019 ఎన్నిక‌ల మాదిరిగా 2024 ఎన్నిక‌లు ఉండేందుకు అవ‌కాశం లేదు. న‌లువైపుల నుంచి కూడా దాడి ఎక్కువైంది. పైగా.. కేంద్రం ఏదో త‌మను ఉద్ధ‌రిస్తుంద‌ని వైసీపీ పాల‌కులు పెట్టుకున్న ఆశ‌లు కూడా కొడిగ‌డుతున్నా యి.

ఈ ప‌రిణామాల‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కొన్ని నిర్ణ‌యాలు.. కొన్ని వాద‌న‌లు వైసీపీకి స‌హ‌జంగానే ద‌డ పుట్టిస్తున్నాయి. మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మూడు ప్రాంతాల మ‌ధ్య విస్త‌రించాల‌ని వేసుకున్న ఎత్తుగ‌డ‌కు కేంద్రం గండికొట్టింది. అస‌లు త‌మ‌కు ఈ విష‌య‌మే తెలియ‌ద‌ని.. విభ‌జ‌న చ‌ట్టంలో ఒకే రాజ‌ధాని ఉన్న‌ద‌ని కూడా చెప్పుకొచ్చింది. దీంతో రేపో మాపో.. విశాఖ వెళ్లిపోవాల‌న్న సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యానికి పెద్ద అవ‌రోధం ఏర్ప‌డిన‌ట్టు అయింది.

ఇక‌, పోల‌వ‌రం నిధుల‌ను ఇప్ప‌ట్లో విడుద‌ల చేసేది లేద‌ని కేంద్రం ఇటీవ‌ల చెప్పేసింది. బ‌డ్జెట్‌లో క‌నీసం ప్ర‌స్తావ‌న కూడా చేయ‌లేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం స్థాయిలోనే చ‌ర్చ‌లకు శ్రీకారం చుడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఒక్క‌సారికి త‌న‌ను న‌మ్మాల‌ని చెబుతున్న ఒక కీల‌క పార్టీ నేత‌కు ద‌న్నుగా నిలిచేందుకు కూడా కేంద్రంలోని పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌తీరు.. వైసీపీలో ద‌డ పుట్టిస్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెర‌గ‌డం.. ఈ కేసులో త‌మను ఇరికించొద్ద ని కేంద్ర‌మే స్ప‌ష్టం చేయ‌డం.. దీనిలో తాము ఏమీ చేయ‌లేమ‌ని చెప్ప‌డం కూడా సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ పెద్ద‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. మ‌రోవైపు.. ఈ నెల‌, వ‌చ్చే నెల‌లో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసుల విచార‌ణ పుంజుకోనుంది. ఎన్నిక‌ల‌కు ముందు ఈ కేసులు మ‌రింత వేగం పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ పెద్ద‌ల నుంచేసంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ శిబిరంలో క‌ల్లోల పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని.. ఏంచేయాల‌ని.. నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 10, 2023 10:33 am

Share
Show comments

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago