మహమ్మారి వైరస్ బారినపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. దీంతో,అమెరికాలో నిరుద్యోగ స్థాయి పెరిగిపోయింది. మరోవైపు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్ సెంటిమెంట్ ను అమెరికన్లలో బలంగా రాజేశారు. దీంతో, భారత్ సహా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేసేవారిపై కొంత వివక్ష ఉంది.
అందుకే, ట్రంప్…వీలు చిక్కినప్పుడల్లా హెచ్ 1 బీ వీసాల సంఖ్య తగ్గించడం…నిబంధనలు కఠినతరం చేయడం…వీలైతే హెచ్ 1 బీ వీసాలతోపాటు విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలిచ్చే, వారి కుటుంబ సభ్యులకు నివాసం కల్పించే అన్ని రకాల వీసాలు రద్దు చేయాలని గోతికాడ నక్కలా కాచుకు కూర్చున్నారు.
అటువంటి ట్రంప్ కరోనా విపత్తును ఆసరాగా చేసుకొని…అమెరికాలో పనిచేసే విదేశీయులకు సంబంధించిన అనేక నిబంధనలను కఠినతరం చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అవకాశం దొరికితే గ్రీన్ కార్డు నిబంధనలు కఠినతరం చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ కు చెందిన సెనేటర్ మైక్ లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి ఉంటుందని మైక్ లీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అమెరికా వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డ్ ఓ కల. శాశ్వతంగా అక్కడ సెటిల్ కావడానికి వీలు కల్పించే చట్టపరమైన వెసులుబాటు. కానీ గ్రీన్ కార్డు పొందడం రోజురోజుకు కష్టతరమవుతోందట. భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం 195 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయట. అమెరికాలో భారతీయులు గ్రీన్ కార్డు పొందేందుకు నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశముందని లీ అన్నారు.
భారత్ నుంచి వచ్చేవాళ్లు గ్రీన్ కార్డు కోసం బ్యాక్ లాగ్ వెయిటింగ్ లిస్టులో చేరితే వారికి గ్రీన్ కార్డ్ రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చాలా సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారని, కొన్ని సార్లు వారు తమ వలస హోదాను కూడా కోల్పోతున్నారని మరో సెనేటర్ డిక్ డర్బిన్ చెప్పారు.
ఈ గ్రీన్ కార్డు సమస్యకు చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొనాలని, ఇందుకు మిగతా సెనేటర్లు కలిసి రావాలని లీ విజ్ఞప్తి చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు మరణిస్తే…వారి సంతానానికి ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం ఏ విధంగానూ ఉపయోగపడడంలేదని లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ కార్డు సమస్య పరిష్కారానికి సెనేటర్లంతా కలిసికట్టుగా సమిష్టి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
This post was last modified on July 23, 2020 5:18 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…