తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 11వ రోజుకు చేరుకుంది.మహిళలు, దళితులు, బీసీలు, యువకులు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తున్నారు. యాత్రను ఏదో విధంగా ఆపాలని ప్రయత్నించి, ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనక్కి తగ్గిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ప్రారంభించి 11 రోజులే అయ్యింది. సగటున రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 110 కిలోమీటర్ల టార్గెట్‌ను దాటిపోయి అప్పుడే 143 కిలోమీటర్లకు లోకేష్ చేరుకున్నారు..
లోకేష్ యాత్రపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కేసులు పెట్టింది. ఆరు వాహనాలను సీజ్ చేసింది. చివరకు పాదయాత్రలో పాల్గొన్న కొంతమంది పై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. నేతల పై నాన్ బెయిలబుల్ సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పాదయాత్ర పొడవునా పోలీసుల నిఘా నేత్రం పనిచేస్తోంది. పాదయాత్రలోకి మఫ్టీలో ఉన్న నిఘా విభాగం అధికారులు ప్రవేశించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు అధికార పార్టీ లో కలవరానికి కారణమవుతోంది.
జనవరి 27న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అంతర్గతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చ జరుగుతూనే ఉంది. కుప్పం , పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలను యాత్ర దాటుతుంటే జగన్ గుండెల్లో లబ్ డబ్ అని సౌండ్ వస్తోందంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.. పాదయాత్ర ప్రారంభమైన కుప్పంలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను అసభ్యంగా దూషించారని తొలిరోజే కేసు నమోదు చేశారు. ఆ తరువాత, బంగారుపాలెంలో మరో రెండు ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. ఇందులో ఒక ఎఫ్‌ఐఆర్ లో హత్యాయత్నం సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పలమనేరులో మరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. బంగారుపాలెంలో ఫిబ్రవరి 3వ తేదీన రెండు కేసులు, పలమనేరులో 4వ తేదీన మరో కేసు నమోదు చేశారు. పైగా డైరెక్టుగా పోలీసులే కేసులు నమోదు చేశారు.
ఎన్ని వందల కేసులు పెట్టినా యాత్ర ఆగదని, ఇచ్ఛాపురం దాకా జైత్ర యాత్ర కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పాదయాత్రను మరింత పకడ్బందీగా నిర్వహిస్తూ సాయంత్రం ఆరు గంటల కల్లా ముగించే విధంగా ప్లాన్ చేయబోతున్నారు..
This post was last modified on February 6, 2023 7:35 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…