చంద్రబాబు, బాలకృష్ణల పేరు వింటేనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మీడియా ముఖంగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెప్పారు. వినడానికి విచిత్రంగా అనిపించినా, ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురయిన నందమూరి తారకరత్న నాలుగు రోజులుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను చూసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన అనంతరం ఆయన ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులు చెప్పిందంతా విలేకరులతో చెబుతూ తారకరత్న గుండె ప్రస్తుతం బాగా పనిచేస్తుందని.. మెదడు భాగం వాపు ఉండడంతో కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు.
తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి వద్ద ఉంటూ స్వయంగా అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నారని.. వైద్యులు మంచి వైద్యం చేస్తున్నారని.. బాలకృష్ణ సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పిన విజయసాయిరెడ్డి ఈసందర్భంగా బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
తారకరత్న విజయసాయిరెడ్డి తోడల్లుడి కుమార్తెను వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కుమార్తే తారకరత్న భార్య. అంటే విజయసాయిరెడ్డికి తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు.
ఆ నేపథ్యంలోనే తారకరత్న అనారోగ్యంపై విజయసాయిరెడ్డి కుటుంబంలోనూ నందమూరి కుటుంబంలో ఉన్నట్లే తీవ్రమైన ఆందోళన ఉంది. రాజకీయంగా బలమైన రెండు కుటుంబాలకు చెందిన తారకరత్న ఆరోగ్యంపై కర్ణాటక ప్రభుత్వం, నారాయణ హృదయాలయ వైద్యులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేసే విజయసాయిరెడ్డి రాజకీయంగా దూకుడుగా ఉంటారు. తరచూ చంద్రబాబును విమర్శించే ఆయన పనిలోపనిగా బాలకృష్ణనూ విమర్శించేవారు. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కుటుంబానికి చెందిన కాలేజీల గోడలు విశాఖ కార్పొరేషన్ అధికారులు కూల్చడం వంటి వాటి వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.
బాలకృష్ణ ఎమ్మెల్యేగానే కాదు నటుడిగానూ పనికిరారని విజయసాయిరెడ్డి గతంలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అంతేకాదు..బాలకృష్ణలాంటి మెదడు లేని మనిషి ఇండియాలోనే లేడని విజయసాయిరెడ్డి గతంలో విమర్శించారు.
తాజాగా బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటూ తన అన్నకుమారుడు తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న తరుణంలో విజయసాయిరెడ్డి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.
This post was last modified on February 1, 2023 9:35 pm
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో…
టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో…
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ స్థానమేంటో, ఆయన స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి ‘బ్రహ్మా ఆనందం’ సినిమా…