Political News

పప్పు అన్నారు… ఈ జనమేంటి? రెస్పాన్సేంటి?

నేల ఈనిందా.. నింగి వంగిందా.. అని 1983 ప్రాంతంలో తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి న‌ప్పుడు అని త‌ర‌చుగా అనేవారు. ఇప్పుడు అది మ‌రోసారి అక్ష‌ర స‌త్యం అయింది. తాజాగా.. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప్రారంభించిన‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు కూడా అంతే స్పంద‌న వ‌చ్చింది. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీ అభిమానులు కుప్పానికి పోటెత్తారు. “ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు ఈ యువ‌గ‌ళం ప్రారంభించా” అని లోకేష్ చాటి చెప్పారు.

తొలుత చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం.. తొలి అడుగు వేశారు. యువత భవిత, ఆడబిడ్డల రక్షణ కోసం, అవ్వా తాతల బాగోగుల కోసం.. దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ ఈసంద‌ర్భంగా నారా లోకేష్ త‌న యువ‌గ‌ళంపై ప్ర‌క‌టించారు. ఈ పాద‌యాత్రలో మొత్తం 4వేల కిలోమీటర్ల మేర లోకేష్ న‌డ‌వ‌నున్నారు.

సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా లోకేష్‌ చూడనున్నారు. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. లోకేష్ పాదయాత్రకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బాల‌య్య‌..

ఎమ్మెల్యే, టీడీపీ కీల‌క నాయ‌కుడు, నందమూరి బాలకృష్ణ.. య‌వ‌గ‌ళం ప్రారంభోత్స‌వంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అయితే.. ఆయ‌న కుప్పంలో ట్రాఫిక్ జామ్ అవ్వటంతో ద్విచక్ర వాహనంపై ఆలయం వద్దకు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కుప్పం వచ్చి యువ‌గ‌ళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నేతలతో కలిసి లోకేష్‌ ముందుకు కదిలారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

This post was last modified on January 27, 2023 4:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటీటీలో మార్కో… ఇంకా ఎక్కువ డోస్

మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…

8 hours ago

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే…

9 hours ago

రానా నాయుడు 2 – భలే టైమింగ్ దొరికిందే

విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…

10 hours ago

ఫస్ట్ ఛాయిస్ అవుతున్న సందీప్ కిషన్

ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…

10 hours ago

మహా ‘ఆనందం’గా ఉన్న బ్రహ్మానందం

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…

10 hours ago

కీర్తి సురేష్ ‘అక్క’ ఆషామాషీగా ఉండదు

బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…

10 hours ago