వైసీపీ మంత్రి.. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నేత ఉష శ్రీచరణ్ పై భూ కుంభ కోణం అభియోగాలు పెరిగిపోయాయి. కేవలం నియోజకవర్గంపరిధిలోనే కాకుండా..జిల్లాలోని కీలక ప్రాంతా ల్లో కూడా మంత్రి అనుచరులు, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న దందాలు..ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిజానికి అధిష్టానానికి తెలిసి చేస్తున్నారో.. తెలియకుండా చేస్తున్నారో.. తెలియదు కానీ, వేల కోట్ల రూపాల్లోనే ఈ దందాలు సాగుతుండడం గమనార్హం.
ఇటీవల ‘జులాన్’ కంపెనీ సేకరించిన భూములను అతి తక్కువ ధరకే దక్కించుకున్నారనే వాదన వినిపిం చింది. ఈ దందాలో ఏకంగా 100 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. దీనిలో కొంత భాగాన్ని మంత్రి భర్త కారు డ్రైవర్ పేరుతో రిజిస్ట్రేషన్ కావడంతో విషయం వెలుగు చూసింది. అయినప్పటికీ.. మంత్రి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా.. మరింతగా రెచ్చిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు.. రైతులకు చెందిన అసైన్డ్ భూములను కూడా బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలు వస్తు న్నాయి. ఇదిలావుంటే, ఇక, నియోజకవర్గమే కాకుండా.. జిల్లాలో ఎక్కడ ఎలాంటి వెంచర్ వేసినా.. రియల్ ఎస్టేట్ వర్గాలు ముందుగానే ముడుపులు దక్కించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కోట్లలోనే ఉందని తెలుస్తోంది. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఫ్లాట్లు తీసుకోగా.. మిగిలిన చోట్ల మాత్రం డబ్బులే కావాలని పట్టుబట్టడం..కోట్లలో వసూలు చేయడం వివాదాలకు దారితీసింది.
ఇక, రాప్తాడు నియోజకవర్గంలో జాతీయ రహదారిని ఆనుకుని వేస్తున్న వెంచర్ల నుంచి రూ. కోట్ల ముడుపులు ఇప్పటికే ముట్టాయని తెలుస్తోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. మంత్రి వర్గానికి ముడుపులు ఇస్తే.. ఎలాంటి నిబంధనలు ఉండదు. అదే ఇవ్వకపోతే.. ఎక్కడా లేని నిబంధనలు తెరమీదికి వస్తుంటాయి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు హడలి పోతున్నారు. ఇక, దీనిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
తాజాగా మంత్రి ఉష అవినీతి బండారాన్ని.. బట్టబయలు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గృహ నిర్బంధాలు కూడా చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించేస్థాయికి వచ్చారంటే మంత్రి ప్రభావం ఏరేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు, మంత్రి తన సొంత ప్రైవేటు సైన్యాన్ని తన భూముల వద్ద మోహరించడం.. ఎవరు వచ్చినా.. దాడులు చేయాలని ఆదేశించడం.. గమనార్హం.
This post was last modified on January 22, 2023 1:36 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…