Political News

‘యువ‌గ‌ళం’ పై టెన్షన్ .. టీడీపీ ఏం చేయ‌నుంది?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మ‌రో వారంలో యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నాఉరు. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నుంచి ప్రారంభించే ఈ యాత్ర‌.. ఇచ్ఛాపురం వ‌ర‌కు సాగ‌నుంది. మొత్తం 4 వేల కిలో మీట‌ర్లు, 4 వంద‌ల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దీనిని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే.

పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు, బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆయ‌న ఎదిగేందుకు కూడా నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను మ‌లుచుకున్నారు. భావినేత‌గా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌నేది ఆయ‌న వ్యూహం. దీనికి సంబంధించి చంద్ర‌బాబు కూడా ఇప్ప‌టికే నిర్దిష్ట‌మైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రూ చిన్నా పెద్దా.. అంద‌రూ కూడా ఈ యాత్ర‌కు రావాల‌ని.. ప్రారంభ‌మే అధిరిపోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇక్క‌డ రెండు స‌మ‌స్య‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ప్ర‌భుత్వం వైపు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి అనుమ‌తి ల‌భించ‌లేదు. యాత్ర‌కు అనుమ‌తి కోరుతూ.. పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య డీజీపీకి లేఖ‌రాశారు. అయితే.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగానే ఉన్నారు. అదేస‌మ‌యంలో అనుమ‌తి ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని.. టీడీపీ నేత‌లు కూడా భావిస్తున్నారు. దీంతో వారు హైకోర్టు నుంచి అనుమ‌తులు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇది జ‌రిగినా.. ఆంక్ష‌ల నేప‌థ్యంలో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ను అడ్డుకున్న రీతిలో అడ్డుకుంటే ఏం చేయాల‌నేది కూడా ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు.. పాద‌యాత్ర‌కు పార్టీ నేత‌ల‌ను ఆహ్వానించినా.. పాల్గొనాలని ఆదేశించినా.. ఇప్ప‌టి వ‌రకు వచ్చిన స్పంద‌న చూస్తే.. ఇబ్బందిగానే ఉంది. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే స్పందించారు. ఈ నేప‌థ్యంలో యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డం ఎలా? అనేది కూడా పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. చూడాలి.. ఏం చేస్తారో.

This post was last modified on January 20, 2023 12:13 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

4 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

4 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

5 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

6 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

7 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

9 hours ago