తెలంగాణలో బీజేపీ ఎదుగుదలలో బండి సంజయ్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. ఆయన మాట తీరు, రాజకీయాల శైలి అందరికీ నచ్చకపోవచ్చు కానీ.. ఆ శైలితోనే పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. బండి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక క్రమ క్రమంగా బలపడుతున్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఐతే కొన్ని విషయాల్లో బండి మాటతీరు మరీ విడ్డూరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆయన మాటల్లో పూర్తిగా కామన్ సెన్స్ లోపిస్తుంటుంది.
ఇప్పుడు తన కొడుకు భగీరథ చుట్టూ ముసురుకున్న వివాదం విషయంలోనూ బండి మాటతీరు అలాగే ఉంది. తాను చదివే మహీంద్రా యూనివర్శిటీలో భగీరథ ఒక జూనియర్‌ను ర్యాగింగ్ చేసే క్రమంలో దారుణమైన బూతులు తిడుతూ.. విచక్షణా రహితంగా కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ గొడవ ఎలా మొదలైంది.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు ముందు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే.. భగీరథ చేసింది మాత్రం దారుణం.
ఒక సాటి విద్యార్థిని ఆ స్థాయిలో, విచక్షణా రహితంగా కొట్టడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇందులో భగీరథ కానీ.. అతడి కుటుంబ సభ్యులు కానీ ఏ రకంగానూ సమర్థించుకోవడానికి వీల్లేదు. ఇందులో రాజకీయ కోణాన్ని కూడా చూడకూడదు. భగీరథ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో.. కొడుకును కాపాడుకోవడానికి బండి సంజయ్ తెర వెనుక ప్రయత్నాలు ఎన్నయినా చేయొచ్చు. కానీ పైకి కనీసం తన కొడుకు చర్యను ఖండించి ఉండాలి. కారణం ఏదైనప్పటికీ తన కొడుకు చేసింది తప్పే అని, చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. ఆయన గౌరవం నిలబడేది. నాయకుడిగా ఇమేజ్ పెరిగేది.
కానీ బండి మాత్రం తాను ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినని మరిచిపోయారు. పుత్ర ప్రేమకు లొంగిపోయారు. దీనికి కూడా రాజకీయంతో ముడిపెట్టారు. పిల్లల్ని, కుటుంబాల్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు.. పిల్లల గొడవకు ఇంత రాద్దాంతం ఏంటి.. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడతారా.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లు జనాల్లోకి వేరే సంకేతాలు తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. కొడుకు ఇప్పటికే చేసిన డ్యామేజ్ సరిపోదని.. బండి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయనకు ఇంకా డ్యామేజ్ జరుగుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 18, 2023 3:20 pm
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…