టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఏపీ సర్కారు జీవో నెంబర్ 1ను జారీ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్ షోలు, సభలు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఈ జీవోను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం తాను మాత్రం మొదటి రోజు నుంచే జీవోను తుంగలో తొక్కతూ ర్యాలీలు నిర్వహించింది. ఈ జీవో చట్ట విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 23వ తేదీ వరకు జీవో నెంబర్ వన్ సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు ఈనెల 20వ తేదీలోగా కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు దారి జారీ చేయడమే కాక తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేయకుండానే..
నిజానికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వీలుంది. 20వ తేదీ లోపు ఆ పనిచేయొచ్చు. ప్రభుత్వ వాదన సహేతుకంగా ఉంటే హైకోర్టే తానిచ్చిన స్టేను ఉపసంహరించే వీలుంది. అయితే ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ సర్కారు ఒక వ్యూహం ప్రకారమే ఈ పని చేసిందని భావిస్తున్నారు.
లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. జీవోపై ఈ లోపు స్టే ఎత్తివేస్తే..ఆ విషయం హైకోర్టు తెలియజేసి.. విచారణను వాయిదా వేసుకునే వీలుంటుంది స్టే లేకపోతే టెక్నికల్ గా జీవో నెంబర్ 1 అమలులో ఉన్నట్లవుతుంది. అప్పుడు లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే ఛాన్స్ తమకు ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే నేరుగా సుప్రీం కోర్టు తలుపులు తట్టామని కొంత మంది వైసీపీ నేతలు చెబుతున్నారు..
ముందే గ్రహించిన టీడీపీ
వైసీపీ మంత్రాంగాన్ని టీడీపీ నేతలు ముందే ఊహించారు. అందుకే అవసరం లేకపోయినా యాత్రకు పర్మీషన్ అడుగుతూ డీజీపీకి లేఖ రాశారు. అధికారికంగా పర్మీషన్ రాని పక్షంలో కోర్టును ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా అనుమతి పొందాలని తీర్మానించారు. అంటే టీడీపీ పకడ్బందీగా ముందుకు వెళ్తోందని అనుకోవాలి..
This post was last modified on January 18, 2023 1:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…