వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే..జనసేన అధినేత పవన్‌పైనే పోటీ చేస్తానని సీనియర్ హాస్య నటుడు, వైసీపీ నాయకుడు, ప్రస్తుతం సోషల్ మీడియా విభాగానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న అలీ ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సంచలన ప్రకటనే అనుకోవాలి. ఎందుకంటే.. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కొన్నాళ్లు చర్చ జరిగింది. అయితే.. అది జరగలేదు. ఈలోగా ఆయనను సలహాదారుగా నియమించారు.
అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అలీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసిపోయింది. ఆయన మనసులో ఉందో.. లేక అధి ష్టానమే చెప్పిందో .. లేక అధిష్టానంతో తనే చెప్పారో తెలియదు కానీ.. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధమని ప్రకటించడం.. మాత్రం రాజకీయంగా చర్చకు వచ్చింది. అయితే.. అది కూడా పవన్‌పైనే కావడం మరింత ఆసక్తిగా మారింది. దీనిని కొంత లోతుగా పరిశీలిస్తే.. వైసీపీ అధినేత అలీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది కూడా ఆసక్తే కదా!!
పవన్ పోటీ చేస్తారని ఇప్పుడు ప్రచారంలో ఉన్న నియోజకవర్గాలు నాలుగు. ఒకటి పిఠాపురం, రెండు తిరుపతి, మూడు మరోసా రి గాజువాక, నాలుగు అనంతపురం అర్బన్. అయితే.. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ మైనారిటీ ఓట్లు పెద్దగా లేవు. పైగా కాపులకు కొట్టిన పిండి వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అదేసమయంలో కమ్మ వర్గం కూడా ఎక్కువగా ఉన్న అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఉంది.
ఈ నేపథ్యంలో అలీ ఇక్కడ పోటీ చేసినా.. ప్రభావం చూపించడం కష్టమే. అలీని ఇప్పటికీ.. కమెడియన్‌గానే ప్రజలు భావిస్తున్నారు. ఆయనను సంపూర్ణ రాజకీయ నేతగా విశ్వసిస్తే.. అప్పుడు ఆయన గెలుస్తారనే భావన ఉంటుంది. గత ఎన్నికల్లో రాజమండ్రిలో అలీ వైసీపీ తరఫున ప్రచారం చేశారు. అయితే.. ఇక్కడ రూరల్, సిటీ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుంది.
గతంలో గుంటూరు వెస్ట్‌లోనూ ఆయన ప్రచారం చేశారు. ఇక్కడ కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. అలీ ప్రచారం పనికిరాలేదనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో బలమైన పవన్ ముందు .. పోటీ చేస్తే.. అలీ తేలిపోవడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. అలా కాకుండా.. మైనార్టీ వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అయితే.. కొంత ఫర్వాలేదనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on January 18, 2023 10:38 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…