Political News

ఎన్టీఆర్ వ‌ర్ధంతి.. జ‌గ‌న్ ఇలా చేస్తున్నారు!

దివంగ‌త మ‌హానాయ‌కుడు, తెలుగు వారి అన్న‌గారు.. ఎన్టీఆర్ వ‌ర్ధంతి ఈరోజు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఆర్భాటంగా చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే.. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ కూడా త‌న‌దైన శైలిలో ఎన్టీఆర్ వ‌ర్ధంతి వేడుక‌లు జ‌ర‌గ‌కుండా.. అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ, మైల‌వ‌రం మ‌రోసారి వేడెక్కాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల‌లో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి 144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు.ఇ క‌, కుప్పంలో పోలీస్ యాక్ట్ 30ని రాత్రికి రాత్రి అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఈ రెండింటినీ క‌లిపి అమ‌లు చేస్తున్నారు. ఎక్క‌డా కూడా ప్ర‌జ‌లు గుమికూడ‌రాద‌ని.. పోలీసు చ‌ట్టాల‌ను గౌర‌వించాల‌ని.. పోలీసులు ప్ర‌చారం చేస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ వ‌ర్ధంతి వేడుక‌లు జ‌రుగుతాయా? లేదా? అనేది సందేహంగా మారింది. ప‌లు ప్రాంతాల్లో టీడీపీ నాయ‌కులు ఏర్పాటు చేసినా.. నాయ‌కులు బ‌య‌ట‌కు రాకుండా.. పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కీల‌క నేత‌ల‌కు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చారు. జీవో 1 ప్ర‌కారం ఈ నోటీసులు ఇవ్వ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. వాస్త‌వానికి ఇటీవ‌ల హైకోర్టు దీనిని స‌స్పెండ్ చేసింది. అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన నేప‌థ్యంలో జీవో 1 లైవ్‌లో ఉంద‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు కూడా రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మాల్లో పాల్గోనేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. కీల‌క నాయ‌కుల‌ను రాకుండా పోలీసులు అడ్డుకోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ వేసిన టెంట్ల‌ను తొల‌గించేలా టెంట్ హౌస్ నిర్వాహ‌కుల‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. మొత్తానికి ఎన్టీఆర్ అంటే.. గౌర‌వం ఉంద‌ని చెప్పే వైసీపీ పాల‌న‌లో ఆయ‌న వ‌ర్ధంతి ఏర్పాట్ల‌ను అడ్డుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

This post was last modified on January 18, 2023 8:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago