కరోనా వైరస్ పట్ల ఇటలీ సహా కొన్ని దేశాలు నిర్లక్ష్యం వహించి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్నాయో చూస్తున్నాం. ఇక భారత్ లాంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశంలో ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అందుకే దేశం ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ.. వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతున్నప్పటికీ ఇంకేమీ ఆలోచించకుండా మూడు వారాల పాటు లాకౌట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇంతకంటే అత్యుత్తమ మార్గం ఇంకోటి లేదు. ఐతే ఈ లాకౌట్ వల్ల రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయమంటున్నారు నిపుణులు. మూడు వారాల లాకౌట్ వల్ల దేశానికి ఏకంగా రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందట.
థియేటర్లు మూత పడ్డాయి. మాల్స్ ఆగిపోయాయి. హోటళ్లు, లాడ్జీలు మూతపడ్డాయి. దుకాణాలన్నింటికీ తెరపడింది. అన్ని రకాల వ్యాపారాలూ ఆగిపోయాయి. రవాణా ఆగిపోయింది. దీని వల్ల ఏ రోజుకు ఆ రోజు ఏ స్థాయిలో నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. వ్యాపారాలన్నీ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులన్నీ ఆగిపోయాయి. దీని వల్ల దేశ ఖాజానాపై రూ.9 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇది దేశ జీడీపీలో నాలుగు శాతమని వాళ్లు అంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. లాకౌట్ మూలంగా అది కనిష్ట స్థాయికి పడిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థికంగా దేశం సంక్షోభాన్ని చూసేలా ఉంది. అయితే ప్రాణ నష్టం ముందు ఈ నష్టం చిన్నదే కాబట్టి సర్దుకుపోవాల్సిందే.
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…