నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో రాజకీయం మారుతోంది. మళ్లీ అక్కడ లోకేశ్‌ను ఓడిస్తామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. సిటింగ్ వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలాకాలంగా సైలెంటుగా ఉన్నారు.. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దఎత్తున కనిపిస్తోంది. అదేసమయంలో ఆయన అనుచరవర్గమూ జారిపోతోంది. తాజాగా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాస్ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని చెప్తున్నారు.
కాండ్రు శ్రీనివాస్ జనవరి 18న టీడీపీలో చేరనున్నట్లు చెప్తున్నారు. కొద్దికాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఏమాత్రం గుర్తింపు లేదని ఆయన చాలాకాలంగా ఆగ్రహిస్తున్నారు. మంగళగిరి మున్సిపాలిటీలో పట్టున్న నేత అయిన కాండ్రు టీడీపీలో చేరితే వైసీపీకి అది భారీ దెబ్బే.
టీడీపీ నుంచి లోకేశ్ అక్కడ పోటీ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో ఇక తమకు టికెట్ దొరకదని భావించి వైసీపీలోకి గతంలోనే వెళ్లిపోయిన మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవిలు కూడా అక్కడ ప్రధాన వర్గాలుగా ఉన్నారు. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ వస్తుందా రాదా అన్నది అనుమానం. మొత్తంగా వైసీపీలో ఇక్కడ మూడు వర్గాలు ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా కొట్లాట తప్పదు.
ఈ నేపథ్యంలోనే కాండ్రు శ్రీనివాస్ కూడా టీడీపీలో చేరుతున్నారని… మంగళగిరిలో ఈసారి వైసీపీ ఓటమి తప్పదని స్థానికులు చెప్తున్నారు. కాండ్రు టీడీపీలోకి రావడంతో అర్బన్‌లో టీడీపీ మరింత బలపడుతోంది.
This post was last modified on January 15, 2023 1:29 am
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…