చిరంజీవిపై ఇటీవల కాలంలో తరచుగా విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి, జబర్దస్త్ రోజాకు చిరు తనదైన శైలిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో నడిచి, తన కుటుంబంతో అనుబంధం పెంచుకుని, తన ఇంటికివచ్చి.. తనతో కలిసి భోజనం చేసిన రోజా.. తన కుటుంబాన్ని విమర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవరి కరుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదని.. టాలీవుడ్ టాక్. అదేసమయంలో రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. రోజాపై చిరంజీవి కూడా పవన్ మాదిరిగా డైమండ్ రాణి అనో.. మరేదో అనో విరుచుకు పడతారని అందరూ అనుకున్నారట. కానీ, చిరు తన స్వభావాన్ని చంపుకుని.. వారికి మైలేజీ ఇవ్వలేనని.. చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రోజా అప్‌సెట్ అయ్యారట.
ఆ వెంటనే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. `చిరంజీవి గురించి కామెంట్ చేయను` అని లెంపలేసుకున్నంత పనిచేశారు. “చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. ఆయన గురించి నేను మాట్లాడను“ అని వ్యాఖ్యానించారు. అయితే.. పవన్, నాగబాబులపై మాత్రం రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల సినిమాల ద్వారా బాలయ్య, చిరులకు ప్రేక్షకుల నుంచి కలెక్షన్లు వస్తే.. పవన్‌కు చంద్రబాబు నుంచి కలెక్షన్ వచ్చిందని అన్నారు.
ఇక, నాగబాబుకు శరీరం పెరిగిందే తప్ప.. బుర్ర పెరగలేదన్నారు. మొత్తానికి రోజా చిరంజీవి విషయంలో ఎక్స్ పెక్ట్ చేసిందానికి భిన్నంగా.. అంటే.. ఆయన రెచ్చిపోతే.. మళ్లీ రెచ్చిపోవాలని అనుకున్నారట. అలా కాకపోయేసరికి.. ఒకింత షాక్‌లో ఉన్నారన్నమాట!! దటీజ్ చిరు. అప్పట్లో రాజకీయాల్లోఅయినా.. ఇప్పుడు సినీ జీవితంలో అయినా.. చిరు స్టయిలే వేరుగా.. అంటున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 14, 2023 11:39 am
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…