రూటు మారింది. ప్రజల ఆలోచన మారింది. టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు కూడా దరహాసం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ బలం పెరగడమే…. ఇప్పుడు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో తన మాస్ డైలాగులతో ఉక్కిరిబిక్కిరి చేశారు…
ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి .. చంద్రబాబు సొంతూరు. చదువు మొత్తం చిత్తూరు జిల్లాలోనే . కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రగిరిలోనే పోటీ చేసేవారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత కుప్పానికి మారారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది 2019లో మాత్రం గట్టి దెబ్బతగిలింది. చిత్తూరులో వైసీపీ పాగా వేసింది. అప్పటి నుంచి తెలుగుదేశానికి ఇబ్బందులు మొదలయ్యాయి. కార్యకర్తలకు వేధింపులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు జరిగాయి. చంద్రబాబు కూడా కొంత డిఫెన్స్ లో పడిపోయారు..
గత రెండు నెలలుగా మాత్రం పరిస్థితులు టీడీపీకి పూర్తి అనుకూలంగా మారాయి. చంద్రబాబు వస్తే జనం నీరాజనం పడుతున్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల వంద శాతం సానుకూలత ఏర్పడింది. జనం కూడా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వారికి శాపంగా మారింది పైగా రాష్టంలో అందరిలాగే ప్రభుత్వ విధానాల పట్ల చిత్తూరు జనం కూడా విసిగిపోయారు. దానితో టీడీపీపై జనాభిమానం పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఆయన అనుచరవర్గం ఫుల్ జోష్ లో ఉన్నారు..
ఇంతకాలం టీడీపీ కష్టాలకు కారణమైన జిల్లా మంత్రి పెద్దిరెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. కుప్పం పర్యటన సందర్బంగా పెద్దిరెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుంగనూరు పుడింగి అంటూ కొత్త కొటేషన్ వదిలారు. పుంగనూరులోనే పెద్దిరెడ్డి కథ తేలుస్తానన్నారు. 14 ఏళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు అనుకుని ఉంటే నువ్వు తిరిగేవాడివా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. ఇదీ ఆరంభం మాత్రమేనన్నారు. జగన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి కూడా సైకోలా మారారని చంద్రబాబు అన్నారు. ఏదేమైనా చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నారు. మున్ముంది పెద్ద సీన్లే ఉండొచ్చు…
This post was last modified on January 6, 2023 3:21 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…