రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రతి ఏటా విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ విధ్వంసాలే. ప్రభుత్వ విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారు. ప్రతిపక్షంలో పలుమార్లు టీడీపీ ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదు. అందుకే జగన్ రెడ్డిని సైకో అనేది. మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొంది. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రజలపై 40 రకాల పన్నులు మోపారు’ అని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.
‘దేశంలో ఎక్కడాలేని ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీరైతు మీద అప్పుంది. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలురైతు వ్యవస్థలో అగ్రస్థానంలో ఏపీ ఉండేది.. ఇప్పుడు కౌలు రైతులు కూడా పారిపోయారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on December 31, 2022 1:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…