Political News

కేసీఆర్‌కు షాక్‌.. మ‌రోవైపు న‌రుక్కొస్తున్న కాంగ్రెస్‌!!

కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నం మీదున్న తెలంగాణ సీఎం KCRకు భారీ షాక్ ఇచ్చేలా వ్య‌వ‌హరిస్తోంది.. జాతీయ పార్టీ కాంగ్రెస్‌. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Rahul కేవలం ప్రతిపక్షాల ఫేస్ మాత్రమే కాదని.. ఆయన కాబోయే ప్రధానమంత్రి అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరెవ్వరూ చేయలేదన్నారు. అధికారం కోసం రాహుల్ రాజకీయాలు చేయట్లేదని, ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ ‘భారత్ జోడో యాత్ర’ లాంటి పెద్ద పాదయాత్ర చేయలేదని అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్లో Congress అధికారంలోకి వచ్చిన అనంతరం పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని.. కాబట్టి బీజేపీ త‌న‌ ముఖ్యమంత్రిని మార్చుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడతామని తెలిపారు. వచ్చే ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

క‌మ‌ల్‌నాథ్‌ వ్యాఖ్య‌ల‌ను లైట్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఈయ‌న ఏఐసీసీ సీనియ‌ర్ మెంబ‌ర్‌. సో.. ఆయ‌న ఏదైనా చెబితే.. పార్టీ అధిష్టానం చెప్పిన‌ట్టుగానే ప‌రిగ‌ణిస్తారు. సో.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌దీసుకుని.. మ‌ళ్లీ యూపీఏ-3 పేరిట రాజ‌కీయాలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే నిజ‌మైతే.. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ జెండామోసేందుకు రెడీ అయిన జేడీఎస్ యూట‌ర్న్ తీసుకోవ‌చ్చు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో అధికారం ద‌క్కించుకోవాలంటే.. కాంగ్రెస్ తో క‌లిసి న‌డ‌వాలి. ఇక‌, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే కూడా కాంగ్రెస్‌కు అనుకూలం. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా కాంగ్రెస్‌కు సానుకూలం. ఇలా.. ఎటు చూసుకున్నా కేసీఆర్ వ్యూహానికి ఇది భారీ దెబ్బేన‌ని.. జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటే కేసీఆర్ కూడా యూట‌ర్న్ తీసుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 31, 2022 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…

4 hours ago

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…

5 hours ago

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

6 hours ago

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…

7 hours ago

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

8 hours ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

8 hours ago