ఇప్పటికే అనేక విశ్లేషణలు వచ్చేశాయి. అనేక మంది నుంచి పరామర్శలు కూడా వచ్చేశాయి. “అయ్యో.. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు.. అయ్యో.. అయ్యయ్యో.. ఎలా ఉండాల్సిన వారు.. ఇలా ఉండిపోయారు!” అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని చాలా మంది పరామర్శిస్తున్నారట. జిల్లా నుంచి రాష్ట్రం వరకు పొరుగు రాష్ట్రం దాకా కూడా.. అనే మంది ఈ జాబితాలో ఉన్నారు.
దీనికి కారణం.. ఇటీవల కాలంలో ఆనం తీవ్రస్థాయిలో సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులను అడ్డు పెట్టుకునో.. వలంటీర్లను అడ్డు పెట్టుకునో.. ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారనేది తెలిసిందే. గతంలో రెండేళ్ల కిందట కూడా.. “అధికారంలోకి వచ్చి ఏడాది అయినా.. ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు” అని హాట్ కామెంట్లు చేశారు. దీనిపై అప్పట్లోనే దుమారం రేగింది.
ఇక, తర్వాత.. మరోసారి తమకు ఇస్తానన్న నిధులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గాల్లోఅభివృద్ధి చేయలేకపోతున్నామని.. పొరుగు రాష్ట్రాల్లో వారే. సంతోషంగా ఉన్నారని ఆనం చెప్పారు. ఇక, మరికొన్నాళ్లకు మేం చేయాల్సింది కూడా అధికారులే చేస్తున్నారు.. ఇక, ప్రజలతో తమకు ఎలాంటి అనుబంధం పెరగడం లేదు అంటూ.. ప్రభుత్వ పథకాల పంపిణీ తీరుపైనా నిప్పులు చెరిగారు.
కట్ చేస్తే.. తాజాగా వరుస రెండు రోజుల్లో ఆనంవారు కాక పుట్టించారు. నాలుగేళ్లలో ఏంచేశామని చెప్పి ఓట్లు అడుగుతాం.. అని తీవ్ర వ్యాఖ్య చేశారు. ఇదికూడా తీవ్ర దుమారం రేగింది. విశ్లేషణలు వచ్చాయి. పలువురు సీనియర్ నేతలు ఆయనను పరామర్శించారు. అయినా.. కూడా ఆనంకు ఒకటి తక్కువైందని అంటున్నారు. అదే.. అధిష్టానం నుంచి ఎలాంటి పోన్ రాకపోవడం.! ఇంత జరిగినా.. ఆనంను అధిష్టానం లైట్ తీసుకుందని.. అందుకే రియాక్ట్ కావడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 2, 2023 10:40 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…