Political News

కందుకూరు ఘ‌ట‌న‌: బాబుకు మోడీ బాస‌ట‌..

నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన ఘోరంపై ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబుకు బాస‌ట‌గా ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన Modi.. బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ధైర్యంగా ఉండాల‌ని కూడా మోడీ సూచించారు.

ఏం జ‌రిగిందంటే..

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధిఏత‌ చంద్రబాబు నాయుడి పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభ వద్ద జ‌రిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా 8 మంది మృతి చెందారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి పేరుతో టీడీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీడీపీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు ప‌ర్య‌టించి.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే బుధవారం ఆయ‌న నెల్లూరు జిల్లా కందుకూరులో ప‌ర్య‌టించారు. రాత్రి 7 గంట‌ల 30 నిమిషాల‌ స‌మ‌యంలో కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గరకు చేరుకుని బహిరంగ సభలో ప్ర‌సంగించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. అయితే, అప్పటికే భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

చంద్రబాబు వాహనం వెంట కూడా జనం పెద్దఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్రవాహ నాలపై కొందరు పడిపోగా.. మరికొందరు 5 అడుగుల లోతున పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన టీడీపీ నేతలు డ్రైనేజీలో పడిపోయినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఘటనా స్థలంలో ఇద్దరు చనిపోగా.. ఆసుపత్రిలో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

మృతి చెందినవారు వీరే
ఉలవపాడు మండలం ఆత్మకూరుకు చెందిన రవీంద్రబాబు
వరిచేను సంఘానికి చెందిన యాకసరి విజయమ్మ
కందుకూరు నాచారమ్మ కాలనీకి చెందిన రాజేశ్వరి
కందుకూరుకు చెందిన కాకుమాని రాజా
గుడ్లూరు మండలం అమ్మవారిపాలెంకు చెందిన చినకొండయ్య
కొండముడుసు పాలానికి చెందిన కలవకూరి యానాది
కందుకూరి మండలం జోగూరుకు చెందిన గడ్డం మధుబాబు
గుడ్లూరు మండలానికి చెందిన పురుషోత్తం  

This post was last modified on December 29, 2022 1:02 pm

Share

Recent Posts

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

53 minutes ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

3 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

5 hours ago