Political News

ప్ర‌తిప‌క్ష‌మ‌నే ఉదాశీన‌తే.. ప్రాణాలు తీసిందా?

ఔను! ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? భౌతిక కార‌ణం.. అంటే క‌ళ్ల‌ముందు మాత్రం.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వస్తున్నారు.. కాబ‌ట్టి వేల సంఖ్య‌లో స‌భ‌కు జ‌నాలు వ‌చ్చారు.. సో.. తొక్కిస‌లాట జ‌రిగింది.. అందుకే చ‌నిపోయారు!

కానీ, తెర‌దీసి చూస్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంత విఫ‌ల‌మైందో.. పోలీసు వ్య‌వ‌స్థ ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిందో క‌ళ్ల‌కు క‌డుతోంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు స‌భ‌లు ఇప్పుడు కొత్త‌కాదు. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోని విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలిలోనూ.. ఆయ‌న స‌భ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కూడా భారీ ఎత్తున వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు, అభిమానులు పోటెత్తార‌నేది తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం గ‌త వారం రోజుల నుంచి ప్రచారంలో ఉంది.

ఈ నేప‌థ్యంలో పోలీసులు.. కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ.. విజ‌య‌న‌గ‌రంలో నిర్వ‌హించిన స‌భ‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని.. ఇక్క‌డ చ‌ర్య‌లు తీసుకుని ఉన్నా.. ప్ర‌జ‌ల‌ను అదిలించి ఉన్నా.. ప్ర‌త్యేక ఏర్పాటు చేసుకోవాల‌ని.. టీడీపీ నేత‌ల‌కు సూచించి ఉన్నా.. ఈ పెను విషాదం జ‌రిగి ఉండేది కాదు. కానీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పార‌నో.. లేక‌.. మ‌రో కార‌ణమో.. తెలియ‌దు కానీ.. పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులుకానీ.. చాలా నింపాదిగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది.

అప్ప‌ట్లోనూ తోపులాట చోటు చేసుకుంది. ఇక‌, ఇప్పుడు ఏకంగా 8 మంది ప్రాణాలు డ్రైనేజీలో క‌లిసిపోయాయి. దీనికి కార‌ణం.. పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందు చూపు లోపించ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఇటీవ‌ల కాలంలో ప్ర‌జాద‌ర‌ణ పెరిగిన నేప‌థ్యంలో వారు ఒకింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌ని అంటున్నారు.

This post was last modified on December 29, 2022 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

6 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

7 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

8 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

11 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

11 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

11 hours ago