తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరులో పర్యటిస్తున్నారు. తొలి రోజు బుధవారం ఆయన కందుకూరు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభించే సమయానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన జనాలు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు.. పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్యకర్తలు.. చంద్రబాబును చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పలువురు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్యకర్తలు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొందరిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘటనా స్థలంలోనే ఇద్దరు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.
అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.
అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on December 28, 2022 9:58 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…