Political News

కరోనా అంటే భయం లేదా.. ఇది చదవండి

కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండట్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది. కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు. కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది.

అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సొసైటీలో పలుకుపడి ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏఎస్ఐ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

కొన్నిసార్లు కరోనా సోకినప్పటికీ.. పరీక్షల్లో అది నిర్ధారణ కాకపోవడం ప్రమాదకరణ పరిణామంగా కనిపిస్తోంది. ప్రేమ్ కుమార్ అనే ఏఎస్ఐ విషయంలో అదే జరిగింది. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ పరీక్షలు చేస్తే నాలుగుసార్లు నెగెటివ్ వచ్చింది. దీంతో మరీ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆరోగ్యం క్షీణించ సాగింది.

ఈ నెల 14న ఉదయం పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పడకల్లేవని తెలిసి.. వేరే చోట్ల ప్రయత్నించారు. ఏఎస్ఐ అయినా సరే.. ఆయనకు వేరే ఆసుపత్రుల్లో కూడా బెడ్ దొరకలేదు. దీంతో గాంధీకి తరలించారు. తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ దొరకడంతో అక్కడికి తీసుకెళ్లారు.

కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. వెంటిలేటర్‌ పెట్టారు. మళ్లీ పరీక్ష చేసి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయాక ఫలితం పాజిటివ్ అని తేలింది. ఈ ఉదంతం కరోనాతో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియచెబుతుంది.

This post was last modified on July 18, 2020 4:26 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

19 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

52 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

5 hours ago