దాదాపు రెండు వారాలకు పైనే ఫామ్ హౌస్ లో గడిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదారు రోజుల క్రితమే ప్రగతిభవన్ కు రావటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికారిక నివాసంలో ఉండకుండా తరచూ ఫామ్ హౌస్ కు వెళ్లి రావటం కొత్తేం కాదు. అప్పుడప్పడు రెండు.. మూడు వారాలు కూడా ఆయన అక్కడే ఉండిపోయారని చెబుతారు.
మామూలు రోజులు కావటం.. అవసరానికి మించిన బలం ఉండటంతో ఆయన్ను వేలెత్తి చూపించే ధైర్యం.. సాహసం చేయలేని పరిస్థితి. విపక్షాలు సైతం ఆయన్ను విమర్శించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడే సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థుల పరిస్థితే ఇలా ఉంటే.. అధికార పార్టీలో ఆయన్ను వ్యతిరేకించాలన్న ఆలోచన కలలోకి రావటానికి కూడా ఇష్టపడరు.
దీనికి కారణం.. కేసీఆర్ మామూలు మనిషి కాదని.. ఆయనకున్న శక్తి సామర్థ్యాలతో తమకొచ్చే కలల్ని కూడా తమ మాటల్లో ఇట్టే అర్థం చేసుకుంటారన్న మాట వినిపిస్తుంటుంది. వినేందుకు అతిశయోక్తిగా అనిపించినా.. గులాబీ పార్టీలోని కీలక నేతల మాటల్ని ఒకసారి వింటే ఈ మాటల్లో నిజం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. గతంలో పలుమార్లు ఫామ్ హౌస్ కు వెళ్లి ఎన్ని రోజులు గడిపినా ప్రజలకు పట్టేది కాదు.కరోనా లాంటి అరుదైన సమయాల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధానిలో కాకుండా కాస్త దూరంగా ఉండే ఫామ్ హౌస్ లో ఉండటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి.
బాస్ అన్నవాడు ఆఫీసులో ఉంటే.. ఉండే లెక్కకు.. బయట ఉన్నాడన్న దానికి మధ్య ఉద్యోగుల్లో తేడా తెలిసిందే కదా. ముఖ్యమంత్రి విషయంలోనూ అలానే ఉంటుంది కదా? కరోనా వేళలో రెండు వారాలకు పైనే ఆయన బయటకు రాకపోవటంతో పలు పుకార్లు షికార్లు చేయటమే కాదు.. చాలానే వాదనలు వెలుగుచూశాయి. ఒక దశలో వేరీజ్ మై సీఎం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగిన విషయాన్ని మర్ చిపోకూడదు. ఎట్టకేలకు ప్రగతిభవన్ కు చేరుకున్నారన్నంతలోనే.. ఆయన తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన విషయం గురించి తెలిసిన వారంతా విస్మయానికి గురవుతున్నారు.
ఇప్పటికే కరోనా రోగుల్ని చేర్చుకునే విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల మీద వస్తున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. దీనికి తోడు.. ఉస్మానియా దవాఖానా దుస్థితితో పాటు.. మరిన్నిసమస్యలు ఉన్నాయి. వాటిని ఒక కొలిక్కి తేకుండానే ఫామ్ హౌస్ కు వెళ్లిపోవటమా? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు వెళ్లిన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ తిరిగి వచ్చేదెప్పుడు? అన్నది మరో ప్రశ్న. ఏమైనా ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయేమో?
This post was last modified on July 18, 2020 3:30 pm
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…