ఏపీలో సామాజిక పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పింఛన్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు లేని నిబంధనలు వీరికి కూడా వర్తింప జేస్తూ.. తాజాగా పింఛన్‌ను కట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో పెన్షన్ నిలిపివేస్తున్నామంటూ వలంటీర్లు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ పత్రా లు ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్ణయం ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది.
2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లకు తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరినట్లు సమాచారం. జనవరి నుంచి పెన్షన్ మొత్తం రూ. 2750 చేస్తున్నామంటూనే, పెద్ద సంఖ్యలో పెన్షన్ల తొలగిస్తున్నారనే వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలు.. తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పింఛన్లు తొలగించారని, వెంటనే అన్నిటిని ఆంక్షలు లేకుండా పునరు ద్ధరించాలని దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. వికలాంగుల , వితంతువుల వృద్ధాప్యంలో పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. వికలాంగుల సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందన్నారు. వివిధ కారణాలు చెప్పి సామాజిక పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2022 6:44 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…