Political News

డ్రగ్ టెస్ట్ కు కేటీఆర్ రెడీ

మర్యాదగా ఉంటానని.. మిగిలిన వారి మాదిరి చిల్లర రాజకీయాలు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు తనకు అలవాటు ఉండదన్నట్లుగా మాట్లాడే మంత్రి కేటీఆర్.. అందుకు భిన్నంగా వ్యవహరించారు.

తనను అదే పనిగా టార్గెట్ చేసే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటుగా రియాక్టు అయిన వేళలో ఆయన బ్యాలెన్స్ మిస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ఎప్పుడే వినని కొత్త తరహా మాటలు వచ్చేశాయి. ఇవన్నీ విన్నప్పుడు.. కేటీఆర్ ఇంతలా ఇరిటేట్ కావాల్సిన అవసరం ఏముంది? అన్న సందేహం కలుగక మానదు.

డ్రగ్స్ పరీక్ష చేయించుకుంటాడా కేటీఆర్? అంటూ తరచూ ఘాటు వ్యాఖ్యలు చేసే బండి సంజయ్ మాటలకు ఎప్పుడూ పెద్దగా రియాక్టు కారు మంత్రి కేటీఆర్. అలాంటిది తాజాగా మాత్రం ఆయన సీరియస్ గా రియాక్టు అయ్యారు. ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి పరుష వ్యాఖ్యలు వచ్చేశాయి. మర్యాదస్తుల నోట్లో నుంచి రాని మాటలు కూడా కేటీఆర్ నోటి నుంచి వచ్చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

డ్రగ్స్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇస్తానని.. రక్తం ఇచ్చేందుకు సిద్ధమని.. కావాలంటే బొచ్చు కూడా ఇస్తానంటూ మండిపడ్డారు కేటీఆర్. గోళ్లు కావాలంటే తీసుకో.. అవసరమైతే కిడ్నీని కూడా తీసుకెళ్లి టెస్టు చేసుకోవాలన్న ఆయన.. ‘‘ఏ డాక్టర్ ను తెచ్చుకుంటావో తెచ్చుకో. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే మాత్రం కరీంనగర్ నడిరోడ్డు మీద నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావా? మళ్లీ మా చెప్పుతో అనుకునేవు. మళ్లీ ఆ పేరుతో పనికిమాలిన గొడవ చేస్తావు’’ అంటూ సీరియస్ అయ్యారు.

తనకు జరిపిన పరీక్షల్లో తాను డ్రగ్స్ వాడినట్లుగా తేలకపోతే మాత్రం కరీంనగర్ కమాన్ వద్ద బండి సంజయ్ చెప్పుతో ఆయనే కొట్టుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి దద్దమ్మలు తమపై ఇలా చేస్తారన్నారు. తాను చెప్పిన దానికి సిద్ధమైతే తాను ఇక్కడే ఉంటానని.. రమ్మనాలని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే కరీంనగర్ కుపనికి వచ్చే పని చేయాలని.. సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ తీసుకురావాలన్నారు.

డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని బండి సంజయ్ సవాలు విసురుతున్న వైనంపై మీడియా ప్రశ్నలు వేయగా.. ఘాటుగా రియాక్టు అయ్యారు కేటీఆర్. ‘‘ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు. పనికిమాలిన వాళ్లు చేస్తారు. దమ్ముంటే ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి. చిల్లర రాజకీయాలు కాదు. ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడాలి. తెల్లారి లేస్తే అరుపులు.. మెరుగుడు.. విచిత్రమైన అరుపులు తప్పించి మరింకేమీ లేదు. పిండాకుడు మాటలు మాట్లాడుతున్నాడు. మనిషా.. పశువా? నేను డ్రగ్స్ శాంపిల్స్ ఇచ్చి మోడీనో.. ఇంకెవరిదైనా ఇవ్వమంటే ఎలా ఉంటుంది?’’ అంటూ సీరియస్ అయ్యారు.

This post was last modified on December 21, 2022 10:29 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago