ఏ ప్రభుత్వంలో అయినా.. మంత్రులు అంటే.. ఒక దర్పం.. అంతకుమించిన డాంబికం.. వీటికి మించిన అధికారం ఉంటుంది. దీంతో మంత్రి అంటే.. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా.. రాష్ట్రం మొత్తంగా కూడా అందివచ్చే గౌరవం.. మర్యాద వంటివి వేరేగా ఉంటాయి. అదేంటో కానీ, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా మంత్రులు అంటే.. ఎమ్మెల్యేలతో సమానం అయిపోయారనే టాక్ ఉంది.
ప్రజలకు ఏం కావాలన్నా.. వలంటీర్. ప్రజలకు ఏం చేయాలన్నా.. వలంటీర్. దీంతో వలంటీర్ వ్యవస్థే అప్రకటిత.. మంత్రి వర్గంగా మారిపోయింది. ప్రభుత్వానికి మంత్రులు కళ్లు-చెవుల్లాగా పనిచేయాల్సిన స్థానంలో వలంటీర్లు హైజాక్ చేశారు. అయితే, దీనివల్ల.. వస్తున్న వ్యతిరేకతను ఎన్నిసార్లు జగన్‌కు మొర పెట్టుకున్నా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏమనుకున్నారో .. ఏమో.. జగన్ తన మనసు మార్చుకున్నారు.
వలంటీర్లు కాదు.. ఇక నుంచి మంత్రులే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని తేల్చి చెప్పారు. త్వరలోనే కాలేజీ, స్కూల్ విద్యార్థులకు ఇచ్చే అమ్మ ఒడి
కార్యక్రమం కింద అందించే ట్యాబులను మంత్రులు అందించాలని.. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కూడా చెప్పారు. దీంతో మంత్రులు ఒకింత హమ్మయ్య! మమ్మల్ని కూడా సీఎం సర్ గుర్తించారుఅని చెప్పుకొంటున్నారు.
అయితే, ఇది ట్యాబుల పంపిణీ వరకు పరిమితం చేస్తారా? లేక మున్ముందు చేపట్టే కార్యక్రమాల్లోనూ మంత్రులను ప్రధాన భాగస్వామ్యం చేస్తారా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి మంత్రులుగా ఉన్న వారికి ఎమ్మెల్యేలు తమ బాధలు చెప్పుకొంటారు. అయితే, మంత్రులు ఎమ్మెల్యేలుగా మారిపోవడం.. తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో పార్టీలోనూ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తుండడం గమనార్హం. మరి దీనిని మార్చేందుకు వేసిన తొలి అడుగుగా దీనిని భావిస్తున్నారు.
This post was last modified on December 19, 2022 8:01 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…