Political News

గాలి పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’!

మైనింగా డాన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి గురించి తెలియని వారుండరు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా గాలి చేసిన అక్రమాలు, తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన్ను అరెస్టు చేయడం బెయిల్ పొందడం అందరికీ తెలిసిందే.

అంతకముందు కన్నడ రాజకీయాల్లో బళ్లారి బ్రదర్స్ గా పేరున్న గాలి సోదరులు చేయని అరాచకం లేదు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా గాలి చాలా రోజులు క్రియాశీలంగానే ఉన్నారు. వంద కోట్లు ఖర్చు చేసి కూతురి పెళ్లి చేశారు. కొంతకాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు..

గాలి ఆశీస్సులతో పార్టీ

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీనితో రాజకీయంగా మళ్లీ నిలబడాలని తీర్మానించుకున్న గాలి జనార్థన్ రెడ్డి… కొత్త పార్టీ దిశగా అడుగులు వేశారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పేరుతో ఈనెల 10న ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ వద్ద కొత్త పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. కేఆర్‌పీపీని అన్ని రకాలుగా తానే చూసుకుంటానని గాలి హామీ ఇచ్చారు. తాను నేరుగా కనిపించకుండా తెరవెనుక ఉండి నడిపించాలని గాలి నిర్ణయించుకున్నారు. గాలికి అత్యంత సన్నిహితుడు, గతంలో బుడా చైర్మన్‌గా పనిచేసిన కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పెడుతున్నారని సమాచారం.

కేఆర్‌పీపీ పేరుతో దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోపు ఎన్నికల కమిషన్‌ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేస్తుంది. అలాగే గుర్తు కూడా ఇస్తుంది. గతంలో హైదరాబాద్‌ కర్ణాటకగా ఉన్న ప్రాంతం ఇప్పుడు కల్యాణ కర్ణాటకగా మారింది. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో గాలి తన మద్దతుదారులను పార్టీ తరపున రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. నిజానికి జనార్దన్‌రెడ్డి 2011లో బీఎస్ఆర్‌ కాంగ్రెస్‌ స్థాపించారు. అది బీజేపీలో విలీనమైంది.

పట్టించుకోని కమలనాథులు

గాలి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీలో ఆయన పవర్ తగ్గింది. గాలి సోదరులు చేసిన అరాచకాలతో విసిగిపోయిన కమలం పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. రాజకీయ లబ్ధి కోసం జనార్థన్ రెడ్డిని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ భావించినా పార్టీ నుంచి వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్ చూసి మౌనం వహించారు. దానితో గత్యంతరం లేక రాజకీయ మనుగడ కోసం గాలి కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారని భావిస్తున్నారు….

బీఆర్ఎస్ తో కలుస్తారా…

గాలి ప్రారంభిస్తున్న కేఆర్‌పీపీ.. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీఆర్ఎస్ తో చేతులు కలుపుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని జేడీఎస్ తో కేసీఆర్ దోస్తీ కట్టారు . ఇప్పుడిక కర్ణాటకలోని తెలుగువారుండే ప్రాంతాల్లో ఓట్లు దండుకోవాలంటే… గాలిని కేసీఆర్ మంచి చేసుకోవాల్సిందే అది కుమారస్వామికి కూడా మంచిదే..

This post was last modified on December 18, 2022 10:46 am

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

17 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

21 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

27 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago