రాజకీయాల్లో నాయకులు తీసుకునే నిర్ణయాలు.. ఒక్కొక్కసారి బూమరాంగ్ అవుతాయి. మరికొన్ని సార్లు.. అయితే.. తమకు ఇబ్బందిగానూ మారతాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి రెండు రకాలుగాను ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా తన టీఆర్ఎస్ పార్టీని మార్పు చేశారు. తద్వారా.. ఆయన దేశం మొత్తం పర్యటించనున్నారు.
అంటే.. ఇక, ప్రాంతీయ వాదానికి ఆయన చోటు పెట్టే ఛాన్స్ లేదు. అదేసమయంలో తెలంగాణలోనే ఉండి.. కేవలం తెలంగాణకే ఆయన రాజకీయం పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ అడుగులు వేయనున్నారు. తద్వారా.. ఏపీ వంటి దాయాది రాష్ట్రానికి కూడా ఆయన రావాల్సి ఉంటుంది. ఇక, అప్పుడు తెలంగాణ వాదానికి ఆయన పూర్తిగా తెరదించేసినట్టే అవుతుంది. అదే సమయంలో తాను ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెడితే.. ఇతర పార్టీలు కూడా తన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాయనే విషయం ఆయనకు తెలియంది కాదు.
అంటే..కేసీఆర్ ఇప్పుడు ఏపీలో అడుగు పెడితే.. ప్రత్యంక్షగా టీడీపీ అధినేతకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.తెలంగాణలో చంద్రబాబు 2018 ఎన్నికల్లో అడుగులువేశారు. అప్పటికి ఆయన ఏపీ సీఎం. అయితే.. దీనిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏపీ వాళ్లు వచ్చి మనల్ని పాలించే అవకాశం ఇస్తమా! అంటూ.. సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించి విన్నయ్యారు. ఇక, ఇప్పుడు ఆ మాట అనే ఛాన్స్ లేదు.
సో.. తెలంగాణలో టీడీపీకి మంచి పట్టు పెంచుకునే ఛాన్స్ కేసీఆర్ చేజేతులా అప్పగించారనే అంటున్నారు పరిశీలకులు. ఇది మంచి పరిణామమని కూడా చెబుతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి పట్టుంది. పైగా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ చీఫ్ అయిన దరిమిలా ఇది మరింత పరిగింది. సో.. ఇప్పుడు చంద్రబాబు స్వేచ్ఛగా తెలంగాణలోకి అడుగులు పెట్టడం మాత్రమే కాదు.. ప్రతిపక్ష స్థాయికి ఎదిగినా.. ఆశ్చర్యంలేదని అంటున్నారు.
This post was last modified on December 17, 2022 5:14 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…