ఇటీవల కాలంలో పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీ హైకోర్టులో ఎదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యుడిగా తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. దీనిపై న్యాయస్థానంలో జరిగిన పోరాటంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గతంలోనే చెప్పింది. హైకోర్టు ఆదేశాల్ని అమలు చేసే విషయంలో ఏపీ సర్కారు జాప్యం చేయటం.. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టుకు వెళ్లటం.. అక్కడ నిమ్మగడ్డకు అనుకూలమైన పరిస్థితే నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్నిఅమలు చేయని ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ ను నిమ్మగడ్డ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గవర్నర్ ను కలిసి హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందిగా కోరాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కోర్టు ఆదేశించింది. తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్ ను నియమించే అవకాశం గవర్నర్ కు ఉందని చెప్పామని పేర్కొంది.
సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై మూడుసార్లు ప్రయత్నించినా.. స్టే ఇవ్వలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి.. తమ తీర్పు అమల్లో ఉన్నట్లేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని.. ఈలోపు నిమ్మగ్డ రమేశ్ కుమార్ ను గవర్నర్ ను కలవాలన్న సూచన చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్ వేయాలని చెప్పింది.
తాజా పరిణామాల్ని చూస్తే.. హైకోర్టు చెప్పినట్లుగా ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డను తిరిగి నియమించక తప్పని పరిస్థితి. ఏ చేత్తో అయితే తీసేశారో.. ఇప్పుడు అదే చేత్తో ఆయనకు బాధ్యతను అప్పజెప్పటం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పక తప్పదు.
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. మొత్తానికి నిమ్మగడ్డ ఎపిసోడ్ ఏపీలోనే కాదు తెలంగాణలోనూ కొత్త ఉత్కంటను తెచ్చిందని చెప్పక తప్పదు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…