నాలుగు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ అనుభవం.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత.. విజన్ 2020 ప్రణాళికను రూపొందిం చిన మేథావి.. టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించిన సవ్యసాచి… ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గొప్పతనాలు చాలానే ఉన్నాయి.
అలాంటి సీనియర్ పొలిటీషియన్ ప్రవర్తనపై ఈమధ్య అనుమానాలొస్తున్నాయి. మారిన బాబు బిహేవియర్ గురించి సమాన్య జనాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుంది..? చంద్రబాబు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు..? దాని వెనుక ఎత్తుగడలేమన్నా ఉన్నాయా.. ? లేక నిజంగానే బాబు మెంటల్ బ్యాలెన్స్ తప్పారా.. ?
చంద్రబాబు ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. రాజకీయ వ్యూహరచన చేయటంలో ఆయనకు తిరుగులేదు. రాజకీయాల కోసం బాబు అందర్నీ వాడుకుంటారన్న విమర్శ వైసీపీ నుంచి బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ హుందాగా, కాన్ఫిడెన్స్ తో కనిపించే చంద్రబాబు ఈ మధ్య బ్యాలెన్స్ తప్పుతున్నట్టే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ వలవలా ఏడ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఎప్పుడూ లేనిది చంద్రబాబు ఎందుకలా బరస్ట్ అయ్యారు..? అని అందరూ తెగ చర్చించుకున్నారు. వైసీపీ నాయకులు మాత్రం చివరకి ఇంట్లోని ఆడవాళ్లను కూడా బాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని.. ఘాటైన విమర్శలు చేశారు. మరి అప్పుడు చంద్రబాబు నిజంగానే ఏడ్చారా…? ఆ కన్నీళ్ల వెనకు వేరే కహానీ ఏమైనా దాగుందా.. ?
లాస్ట్ ఇయర్ ఏడ్చిన విషయం పక్కనపెడితే.. ఈమధ్య చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో చంద్రాబాబు వాడిన “ఆఖరి ఛాన్స్” అనే పదం పెద్ద దుమారాన్నే రేపింది. అదే అదునుగా భావించి.. ఈ ఎన్నికలతో చంద్రబాబు చేతులెత్తేస్తున్నారనీ, పార్టీ అంతం కాబోతుంది కాబట్టే ఆయన అలా మాట్లాడారంటూ.. వైసీపీ నేతలు సంబరపడ్డారు.
తర్వాత నాలుక కరుచుకుని “ఇవి ప్రజలకు ఆఖరి ఎన్నికలు” అంటూ చంద్రబాబు కవర్ చేసుకోవటానికి ట్రై చేశారు కానీ.. అవి అంతగా అతకలేదు. ప్రస్తుతం ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో వైసీపీ పరిపాలనపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు. ఆమధ్య చిత్తూరు జిల్లా కొల్లుపల్లి రోడ్ షో లో “రౌడీలకు రౌడీగా ఉంటా..” అంటూ చంద్రబాబు తెగ ఊగిపోయారు. సాధారణంగా చంద్రబాబు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఈ మధ్య మాత్రం అందులో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన మాటల్లోనే కాదు, ప్రవర్తనలో కూడా చాలా ఛేంజ్ కనిపిస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. ఐతే.. ఆ మార్పు వెనుకున్న అసలు రహస్యమేంటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు.
This post was last modified on December 5, 2022 2:21 pm
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…