Political News

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ రెడీ !

పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలకు సంబంధించి కొత్త గడువును డిసైడ్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ సాగలేదని తెలుస్తోంది. ఎజెండాలో పేర్కొన్న అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..

  • ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాల ఏర్పాటు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆమోదం. వచ్చే ఏడాది మార్చి 31 లోపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో మూడు.. ఏడు సెక్షన్ లను సవరణ చేస్తూ నిర్ణయం.పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చ.
  • ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడంపై కేబినేట్ లో చర్చ. గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు ఎంతన్న విషయంపైనా మాట్లాడుకోవటం జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా అడుగులు.
  • మరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి అనుమతి.
  • ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం.
  • ఐదు కోట్ల రూపాయిలతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసే అంశంపై చర్చ
  • కర్నూలు జిల్లాలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయిలతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటు
    పలు అంశాలపై చర్చ జరగటంతో పాటు.. పలు శాఖల్లోని పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. కొత్త పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్ లో ఒక పోస్ట్ ఏర్పాటు చేసి.. భర్తీ చేయాలి
  • 420 టీచర్ పోస్టులను, 178 నాన్ టీచింగ్ పోస్ట్ లను శ్రీకాకుళం, ఒంగోలులో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ క్నోలెడ్జి అండ్ టెక్నాలజీ లో పోస్టుల భర్తీకి ఆమోదం
  • 31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించాలన్న నిర్ణయం
  • సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్ ల పోస్టింగ్ లను ఏర్పాటుకు ఓకే.
  • డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిస్తూ కేబినేట్ లో అమోదం.
  • ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటు.

This post was last modified on July 15, 2020 8:09 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

22 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

37 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

38 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago