తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను, కేబినెట్‌లను కోర్టులే నిర్ణయిస్తే.. కోర్టులే నిర్దేశిస్తే.. ఇక, ఆయా ప్రభుత్వాలు ఎందుకు ? అని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది మూడు రాజధానులకు అనుమతి ఇచ్చినట్టేనా? వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు కలలు కంటున్న మూడు రాజధానులకు సుప్రీం పచ్చజెండా ఊపినట్టేనా? అంటే.. కాదని అంటున్నారు న్యాయనిపుణులు.
ఎందుకంటే..ప్రస్తుతం హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై మాత్రమే సుప్రీం కోర్టు విచారణ జరిపిందని అంటున్నారు. హైకోర్టు తన పరిధిని మాత్రమే దాటిందని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని వీరు చెబుతున్నారు. కానీ, ఇక్కడ దీనిని లోతుగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. అందుకే పూర్తిస్థాయి విచారణకు ఇంకా సమయం పడుతుందని.. జనవరి 13వ తేదీ వరకు దీనిని వాయిదా వేయడం వెనుక ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు.
అంతమాత్రాన వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనుకానీ, పూర్తి అనుమతులు కానీ, ఇచ్చేసినట్టు కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. ఇక్కడి రైతుల విషయాన్ని సానుకూల ధోరణిలో సుప్రీం చూసే అవకాశం ఉందని అంటున్నారు. రైతులు పచ్చటి పంటపొలాలను ఇచ్చినందున వారి అభిలాషను.. వారి ఆకాంక్షను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని చెబుతున్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా.. అనేది ప్రభుత్వ నిర్ణయమే అయినా.. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీం కోర్టు మూడు రాజధానులకు అనుకూలమైన తీర్పు ఇచ్చిన ట్టుగా భావించరాదని అభిప్రాయపడుతున్నారు. సో.. సుప్రీంతీర్పుతో వైసీపీ నాయకులకు ఊరట కలిగిందని చెప్పలేమని అంటున్నారు.
This post was last modified on November 28, 2022 2:19 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…