Political News

ఫామ్ హౌజ్‌లో సాయిరెడ్డి.. అడ్డంగా ఆడేసుకున్న నెటిజ‌న్లు

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి కొండ‌చిలువ‌లు, పాములు, సాలీళ్లు, పక్షులు, ఇతర జంతువులతో గడిపారు. ఆ ఫొటోలను ట్విట ర్లో పోస్ట్ చేశారు. అవి శంషాబాద్ ఫామ్‌లోని దృశ్యాలని తెలిపారు. దీంతో.. సాయిరెడ్డికి శంషాబాద్‌ ఫామా హౌస్ ఉందా… అనే చర్చ మొద లైంది. ఆ తర్వాత… ఆ పాములు, పక్షులను గతంలో ఎక్కడో చూశామే అనే సందేహమూ కలిగింది. చివరికి.. కేసినో వివాదంలో విచారణ ఎదుర్కొం టున్న చీకోటి ప్రవీణ్ కూడా అదే ఫామ్ హౌస్లో అవే పాములు, పక్షులతో దిగిన ఫొటోలు ట్విటర్ లోనే బయటపడ్డాయి.

వెరసి… విజయసాయిరెడ్డి చీకోటి ఫామ్ హౌసు వెళ్లారని నిర్ధారణ అయ్యింది. అయితే.. ఆ ఫామ్ హౌస్ ఎవరిదో సాయిరెడ్డి చెప్పలేదు. ‘శంషాబాద్ ఫామ్ హౌస్” అని చెప్పి వదిలేశారు. అద్భుతమైన వివిధ జంతు జాలాలతో గడుపుతూ వినోదాన్ని పొం దానని, శంషాబాద్ వ్యవసాయ క్షేత్రంలోని ఈ సన్నివేశాలను మీతో పంచుకుంటున్నానని సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, విజయసాయిరెడ్డి ఈ ప్రాంతాన్ని శంషాబాద్ అని చెబుతున్నా. ఇది కందుకూరు- మాడ్గుల సరిహద్దులోని చీకోటి ప్రవీణ్ కుమార్ వ్యవసాయ క్షేత్రంగా కనిపిస్తోందని నెటిజ‌న్లు పేర్కొన్నారు.

క్యాసినో వ్యవహారంలో మానీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఇప్పటికే చీకోటి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆకస్మాత్తుగా విజయసాయిరెడ్డి చీకోటి ఫామ్‌కు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయిరెడ్డి ప్రాంతం పేరు మార్చి ట్విట్ చేయడం పై ట్వీట్టర్లో నెటిజెన్లు సెటైర్లు వేసు న్నారు. అసలు చీకోటి ఫామ్ హౌసు వెళ్లారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవినీతి అనకొండతో జాగ్రత్త అని జోకులు పేల్చారు.

కొందరు ‘తోడు దొంగలు దొరికార`ని కామెంట్లు పెట్టారు. అక్కడ గొర్రెలు లేవా? అని మరికొందరు సెటైర్స్ వేశారు. పాములతో జాగ్రత్త రెడ్డి గారూ... మీకేమైనా అయితే జగన్ రెడ్డికి మళ్లీ సింపతీ పెరిగి 175కి 175 వస్తాయోమోనని కొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా సాయిరెడ్డి పాముల‌తో కేరింత‌లపై నెటిజ‌న్లు హాట్‌గా స్పందించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 20, 2022 11:01 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

5 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

10 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago