దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. మొత్తం ఏడు స్థానాల్లో ఒక్కటి తప్ప ఆరు చోట్ల అధికార పార్టీ వైపు ప్రజలు అండగా నిలిచారు.
1) తెలంగాణ: ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అధికారపార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 97 వేల పైచిలుకు ఓట్లు సాధించి.. విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆదిలో ప్రతిపక్షం బీజేపీతో ఒకింత హోరా హోరీ పోరు సాగినా.. తర్వాత ఇది అధికార పార్టీకి అనుకూలంగా మారి.. టీఆర్ ఎస్ విజయం వైపు అడుగులు వేసింది.
2) ఉత్తర్ప్రదేశ్: ఇక్కడ గోల గోఖర్నాథ్ శాసనసభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార బీజేపీ పట్టు నిలుపుకుంది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్గిరి 34,298 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అమన్గిరి 1,24,810 ఓట్లు సాధించగా.. ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీకి 90,512 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో గోల గోఖర్నాథ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
3) హరియాణా: ఈ రాష్ట్రంలోని అధంపుర్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్పై 15,714 ఓట్ల తేడాతో భవ్య బిష్ణోయ్ విజయ కేతనం ఎగురవేశారు. అంతకుముందు అధంపుర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.
4) మహారాష్ట్ర: ఇక్కడి అంధేరి ఈస్ట్కు జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షం శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి రుతుజా లట్కే విజయకేతనం ఎగురవేశారు. ఈ ఏడాది మేలో శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన భార్య రుతుజా లట్కే శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) తరపున బరిలో దిగారు. ఆమెకు 66,247 ఓట్లు రాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న నోటాకు 12,776 ఓట్లు రావడం విశేషం.
5) బిహార్: ఈ రాష్ట్రంలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ, ఆర్జేడీ చెరొక స్థానంలో గెలుపొందాయి. గోపాల్గంజ్ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా, మోకామాలో ఆర్జేడీ విజయం సాధించింది.
6) ఒడిశా: ఒడిశాలోని ధామ్నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్షం బీజేపీ అభ్యర్థి సూర్యభన్షి సూరజ్ ఓడిపోగా… అధికార పార్టీ బీజేడీ అభ్యర్థి అభంతి దాస్ 7,661 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
This post was last modified on November 6, 2022 6:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…