పెద్ద కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయింది. చిన్న కూతురు కూడా అదే విధంగా వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆమెను ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని రెల్లి వీధిలో జరిగింది. కూతుర్ని తానే చంపిన తండ్రి ఆ తర్వాత సెల్ఫీ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ సెల్ఫీ వీడియోను తండ్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కన్నతండ్రే కూతురిని హతమార్చిన ఘటన ఏపీలోని విశాఖపట్టణం నగరంలోని రెల్లివీధిలో జరిగింది. హత్య చేసిన అనంతరం సెల్ఫీ వీడియో తీసి తన కూతురిని తానే చంపేశానని చెబుతూ సామాజిక మధ్యమాలలో తన తండ్రి వడ్డాది ప్రసాద్ పోస్ట్ చేశాడు. నగరంలోని రెల్లివీధిలో నివాసం ఉంటున్న వడ్డాది ప్రసాద్ (42)ని భార్య హేమలత 13 సంవత్సరాల క్రితం వదిలేసి వేరుగా ఉంటోంది. ఆ 13 సంవత్సరాల నుంచి వీరి ఇద్దరు ఆడపిల్లల్ని ప్రసాద్ పెంచాడు.
పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోగా.. రెండు రోజులు క్రితం చిన్న కూతురు కూడా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు సమాచారం అందుకున్నాడు. దీంతో వన్ టౌన్ స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ చేసినప్పటికీ తన కూతురు మనసు మారలేదని.. కూతురు ప్రేమించిన వ్యక్తి పై కేసులు కూడా ఉన్నాయని తండ్రి నచ్చజెప్పినప్పటికి వినలేదని తెలిసింది.
దీంతో ప్రసాద్ తన తల్లి చనిపోయిన రోజు కావడంతో కూతుర్ని భోజనానికి రమ్మని ఇంటికి పిలిచాడు. తండ్రి మాటలను విశ్వసించిన కుమార్తె.. పాత గొడవలు మరిచిపోయాడని భావించి ఇంటికి వచ్చింది. అయితే, ఇదే అదునుగా.. ఆమెను నరికి నరికి హత్య చేసినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం వన్ టౌన్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on November 5, 2022 11:17 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…