తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టున్న ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. ఇక, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని ఆ పార్టీ విశ్వప్రయత్నమే చేసింది. దీంతో, మునుగోడులో త్రిముఖ పోరు చలికాలంలోనూ హీట్ పుట్టించింది.
ఇలా రాజకీయ వేడితో సెగుల పుట్టిస్తున్న మునుగోడు రాజకీయం కాస్త చల్లబడిందంటే అందుకు కారణం మాత్రం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అని చెప్పవచ్చు. తన మార్క్ డైలాగులు…హావభావాలు…చేష్టలతో పాల్ చేసే కామెడీ జబర్దస్త్ కన్నా ఎక్కువే వినోదాన్ని పంచింది. తనదైశన శైలిలో పాల్ చేసిన ప్రచారం ఈ బైపోల్ పోరుకు కాస్త కామెడీ టచ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆ కామెడీని పాల్ పోలింగ్ బూత్ వరకూ కొనసాగించిన వైనం వైరల్ గా మారింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వ్యవహరిస్తున్న కేఏ పాల్ పోలింగ్ వేళ ప్రచారానికి మించిన సందడి చేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన అభ్యర్థులకు భిన్నంగా ఉన్న పాల్ తీరు ఇటు మీడియాలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ..రచ్చ రేపుతోంది. పాల్ కు ఈసీ ఉంగరం గుర్తు కేటాయించడంతో…పది వేళ్లకు పది ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూత్ లను సందర్శిస్తున్నారు పాల్.
ఇక, చేతికి 10 ఉంగరాలతో 100 పోలింగ్ బూత్ లను విజిట్ చేయాలని పాల్ ఫిక్స్ అయ్యారు. అందుకే, ఒక పోలింగ్ బూత్ నుంచి పరుగు పరుగున మరో పోలింగ్ బూత్ కు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పోలింగ్ బూత్ నుంచి పాల్ బయటకు వస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ టార్గెట్ పూర్తి చేసేందుకు తాను పరుగులు తీస్తున్నానని పరిగెడుతూ మీడియా ప్రతినిధులకు చెబుతూ వెళ్లిపోయారు పాల్.
ఇక, 10 ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూత్ లోకి వెళ్లడం ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించినట్లు కదా అని పాల్ ను విలేకరులు ప్రశ్నించారు. అలా అయితే, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అని, 30 వేల కార్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నారని పాల్ చెప్పిన ఆన్సర్ కు విలేకరుల మైండ్ బ్లాక్ అయిందట. వారిని సైకిళ్ల మీద రమ్మని చెప్పలేం కదా అంటూ పాల్ ఇచ్చిన ఆన్సర్ విని వారంతా షాకయ్యారట. మరి ఇన్ని ఉంగరాలు పెట్టుకొని గింగరాలు తిరుగుతున్న పాల్ ఆఫ్ ది రింగ్స్..బైపోల్ లో కనీసం డిపాజిట్ అయినా తెచ్చుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
This post was last modified on November 3, 2022 3:41 pm
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…