Political News

జగన్ ని నమ్ముకున్నారు .. పనైపోయింది

పదవుల పంపకానికి సంబంధించి జోరు పెంచేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ.. ఇప్పటికి తనకు వీర విధేయులుగా వ్యవహరిస్తూ.. తనకు మద్దతుగా గళం విప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని పలువురికి ఆయన పదవులు ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉండటం తెలిసిందే. ఈ వాదనలకు చెక్ పెట్టే దిశగా జగన్ నిర్ణయాలు ఉండటం గమనార్హం. రెండు మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని అప్పజెప్పారు ప్రముఖ కమెడియన్ కమ్ యాంకర్ అలీ.

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరున్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం జగన్ పక్షాన నిలిచిన అలీకి..తాజాగా సలహాదారు పదవి ఇవ్వటం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు జగన్. అంతకు ముందు అలీ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు రావటం.. అదే సమయంలోనే ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని అప్పజెప్పటం ద్వారా సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది.

ఆయన్ను సలహాదారుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్న విషయాన్ని ఏపీ సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ కు వీర విధేయుడిగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున వకల్తా పుచ్చుకోవటమే కాదు.. అవసరానికి తగ్గట్లు.. ఆయన వైరి వర్గంపై విరుచుకుపడే బాధ్యతను నిర్వహించే పోసాని క్రిష్ణమూరళిని కీలక పదవికి ఎంపిక చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఆయన్ను ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోసాని నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో జగన్ పక్షాన వాదనలు వినిపించే మరో సినీ ప్రముఖుడికి కీలక పదవి లభించినట్లుగా చెప్పాలి. తాజాగా జగన్ దూకుడు చూస్తే.. రానున్న రోజుల్లో మరికొన్ని నియామకాల్ని కచ్ఛితంగా చేపడతారని చెబుతున్నారు. పదవీ కాలం మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటం.. ఎన్నికల వేళ.. మరింత మందిని తన సైన్యంగా మార్చుకునేందుకు వీలుగా.. మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.

This post was last modified on November 3, 2022 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

50 minutes ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

2 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

3 hours ago

‘జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదలిపోయింది’

వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…

4 hours ago

మీ ఆవిడ ఇండియన్ కాదా? US వైస్ ప్రెసిడెంట్ కు షాక్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…

7 hours ago