Political News

నాన్న‌గారి బాట‌లో వైసీపీ త‌న‌యులు..

వైసీపీలో చాలా మంది నాయ‌కులు తండ్రుల బాట‌లో న‌డిచేందుకు ముందుకు వ‌స్తున్నారు. వీరిలో చాలా మంది సీనియ‌ర్ల బిడ్డలు ఉండ‌డం గ‌మ‌నా ర్హం. అయితే, వీరిలో ఎవ‌రువిన్ అవుతారు.. ఎవ‌రు ఫెయిల్ అవుతార‌నే చ‌ర్చ‌క‌న్నా ముందు. అస‌లు సీఎం జ‌గ‌న్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఇది ఇంకా తేల‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. త‌గ్గేదేలే అంటూ.. నాయ‌కుల త‌న‌యులు దూకుడుగానే ఉన్నారు. ఉమ్మ‌డి కృష్ణాలోని మ‌చిలీప‌ట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు దూకుడు మామూలుగాలేద‌నే టాక్ వినిపిస్తోంది.

నేరుగా వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నాడు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని కూడా కిట్టు నిర్వ‌హిస్తున్నాడు. అధికారుల‌తోనూ మాట్లాడుతున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న జోరు చూస్తే కాబోయే ఎమ్మెల్యే అన్నట్టుగానే ఉంది. ఇదే విష‌యాన్ని బ్యాన‌ర్ల రూపంలో ఆయ‌న స్నేహితులు సైతం పెడుతున్నారు. ఇక‌, మ‌రో మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ త‌న‌యుడు కూడా దూకుడుగా ఉన్నారు. న‌ర‌స‌న్న‌పేట‌లో ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ తండ్రి వెంటే ఆయ‌న ప‌రుగులు పెడుతున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా ఆయ‌న క‌లుస్తూ.. హామీలు గుప్పిస్తున్నారు.

ఇక‌, స్పీక‌ర్ త‌మ్మినేని త‌న‌యుడు కూడా ఇదే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే, వీరిలో ఎవ‌రికీ కూడా జ‌గ‌న్ టికెట్ ఇస్తాన‌ని కానీ, ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని కానీ చెప్ప‌లేదు. కానీ, త‌మ మాట జ‌గ‌న్ తీసేయ‌డు అనే ధీమాతోనే వీరు ఇలా చేస్తున్నార‌నే వాద‌న అయితే పార్టీలో వినిపిస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఇదిలావుంటే, చిత్తూరులో కొంద‌రు నాయ‌కులు కూడా ఇలానే చేస్తున్నారు. త‌మ కుమారుల‌ను కార్య‌క్ర‌మాల‌కు పిలుస్తున్నారు. దీంతో ఇక్క‌డ కూడా ఆస‌క్తిక‌ర రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రి చివ‌ర‌కు జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

ఎదుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు సీరియ‌స్ అవుతున్నాయి. గెలుపు హోరాహోరీ కానుంది. ఇలాంటి స‌మ‌యంలో జూనియ‌ర్ల‌కు ఇచ్చి చేతులు కాల్చుకోకూడ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కానీ, వీరు మాత్రం జ‌గ‌న్ ఎందుకు ఇవ్వ‌రు? మేం ఒక‌టి.. మా వార‌సులు ఒక‌టీనా? అని ప్ర‌శ్నించేధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గానే మారింది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

This post was last modified on November 3, 2022 7:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

3 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

4 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

4 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

5 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

6 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

6 hours ago