ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అమరావతిని దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతోంది జగన్ సర్కారు. ఐతే తమ నుంచి భూములు సేకరించి, చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్నాక.. ఇలా రాజధానిని తరలించడం ఏం న్యాయమంటూ అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు.
జగన్ సర్కారు చేసింది చట్టవిరుద్ధం కావడంతో ఇప్పటిదాకా కోర్టులో ప్రతిసారీ అమరావతి రైతులదే పైచేయి అవుతూ వచ్చింది. కాగా ఈ కేసుపై తుది విచారణ సుప్రీం కోర్టులో జరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించాల్సిన కొత్త చీఫ్ జస్టిస్ యుయు లలిత్ ‘నాట్ బిఫోర్ మి’ కారణాన్ని చూపించి ఈ కేసు నుంచి తప్పుకున్నారు.
ఏదైనా కేసులో తనకు విరుద్ధ ప్రయోజనాలు తలెత్తుతాయని భావించినపుడు న్యాయమూర్తులు ఇలా ‘నాట్ బిఫోర్ మి’ ఆప్షన్ ఎంచుకుని ఆ కేసు నుంచి తప్పుకోవడం మామూలే. గతంలో యుయు లలిత్.. వైఎస్ జగన్ అవినీతి కేసుల్లో లాయర్‌గా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసును ఆయన విచారిస్తే విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుంది. అందుకే చీఫ్ జస్టిస్ గౌరవంగా ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులున్న బెంచ్ వద్దకు అమరావతి కేసు వెళ్లబోతోంది.
రాజధాని అంశం చాలా పెద్దది కావడం, అందులోనూ ఇప్పటికే కేసు మూడేళ్లుగా విచారణలో ఉన్న నేపథ్యంలో సాద్యమైనంత త్వరగా పరిష్కరించడానికే సుప్రీం కోర్టు చూడొచ్చు. మరి తుది విచారణ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తీర్పును అనుసరించి 2024 ఎన్నికల ముంగిట అమరావతి వ్యవహారం అత్యంత కీలకంగా మారే అవకాశముంది.
This post was last modified on November 1, 2022 2:05 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…