వైసీపీ వ్యూహాలమీద వ్యూహాలు పన్నుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రజలను వివిధ పథకాలతో ఆకర్షించిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు సామాజిక వర్గాల వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. కులాల వారిగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి సుమారు 56 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి.. మంత్రులను చైర్మన్‌లుగా నియమించనున్నారు.
వీరు.. ప్రజల్లోకి వెళ్లనవసరం లేదు. కేవలం తమ తమ సామాజిక వర్గాలను కలిస్తే.. సరిపోతుంది. వారిని తమ పార్టీకి అనుకూలంగా మార్చడమే వీరికి పార్టీ ఇస్తున్న ప్రధాన టాస్క్. ఆయా సామాజక వర్గాల సమస్యలను మరింతలోతుగా అధ్యయనం చేయడంతోపాటు.. వాటి పరిష్కారంపైనా ఈ కమిటీలు దృష్టి పెట్టనున్నాయి. అంతేకాదు.. సామాజిక వర్గాలతో త్వరలోనే ప్రారంభం కానున్న కార్తిక మాసం.. సందర్భంగా.. వన భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి అయ్యే ఖర్చులను మంత్రులే భరించాల్సి ఉంటుంది.
ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఎంత మంది మంత్రులు ఉంటారో.. వారంతా దీనిలో భాగం కావాలి. వారు తమ సామాజిక వర్గాల సమస్యలను తెలుసుకుని.. వాటిని పరిష్కరిస్తామనే నమ్మకం కల్పించడంతోపాటు.. వారిలో ప్రభుత్వంపై ఉన్న అపనమ్మకాన్ని కూడా.. తొలగించే ప్రయత్నాలు చేయాలి. అదేసమయంలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లేదని.. భావిస్తున్న బ్రాహ్మణ వర్గంలో బాధ్యతలను విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగిస్తున్నారట. ఈయన ఆ వర్గాన్ని ముందుకు నడిపించాలి. ఇక, వైశ్య వర్గం బాధ్యతలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీసుకోనున్నారు.
ప్రస్తుతం క్షత్రియ వర్గం బాధ్యతలను.. మాజీ మంత్రి.. శ్రీరంగనాథరాజుకు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి వర్గంంలో కమ్మలకు చోటు ఇవ్వలేదు. దీంతో ఈ వర్గాన్ని పార్టీవైపు తిప్పుకొనేందుకు వల్లభనేని వంశీకి కానీ, మర్రి రాజశేఖర్‌కు కానీ.. అప్పగిస్తారని.. తెలుస్తోంది. ఎవరికి బాధ్యత అప్పగించినా.. అందరూ కలిసి.. వన సమారాధనలు నిర్వహించి.. ఆయా వర్గాలను పార్టీవైపు మళ్లించడమే ప్రధాన లక్ష్యం. గతంలో అంటే.. 2019 ఎన్నికలకు ముందు కూడా.. వైసీపీ ఈ వ్యూహాన్ని అమలు చేసి.. సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు కూడా.. ఇదే వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 30, 2022 5:28 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…