మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలవాలి. అన్నగా, సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా బహిరంగంగా తమ్ముడి గెలుపుకు పనిచేయలేరు. అందుకనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్లాన్ చేసినట్లున్నారు. ఎలాగూ ఈయనకు కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యంలేదు. అందుకనే కాంగ్రెస్ గెలవదని, ఓడిపోయేపార్టీ తరపున ప్రచారం దేనికంటు ఆస్ట్రేలియాలో తనను కలిసిన వాళ్ళతో కావాలనే కామెంట్ చేశారు.
ఆయన అంచనా వేసినట్లే ఎంపీపై ఫిర్యాదులు వెళ్ళగానే వెంటనే అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. సమాధానం చెప్పటానికి పదిరోజులు గడువిచ్చింది. షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానమిస్తారని కూడా ఎవరూ అనుకోవటంలేదు. ఎందుకంటే తనకు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసిందనే నెపంతో పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అసలు అధిష్టానం తనకు నోటీసు ఎప్పుడిస్తుందా అని ఎంపీ ఎదురుచూస్తున్నట్లున్నారు.
అన్నదమ్ములిద్దరు మాట్లాడుకుని ప్లాన్ ప్రకారమే ముందు తమ్ముడు కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామాచేసి బీజేపీలో చేరారు. మునుగుడో ఉపఎన్నికలో తమ్ముడు గెలిస్తే అన్నకూడా బీజేపీలోకి వెళిపోతారు. లేకపోతే అప్పుడు ఏమిచేయాలో ఆలోచిస్తారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం గ్యారెంటీగా చెప్పచ్చు. అదేమిటంటే పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు ఎంపీ రేవంత్ తో గొడవలుపడుతునే ఉంటారు. ఆయన ప్రశాంతంగా ఉండరు, ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయరు.
ఉప ఎన్నిక రిజల్టుతో సంబంధం లేదని అనుకునుంటే సోటీసుకు సమాధానంగా పార్టీకి రాజీనామా లేఖ పంపించే అవకాశాలున్నాయి. బీజేపీలోచేరి కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి పూర్తిస్ధాయిలో పనిచేస్తారు. అప్పుడుకానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కెపాసిటి ఏమిటో జనాలకు తెలీదు. ఎందుకంటే పార్టీకన్నా తామే గొప్పవాళ్ళమన్న ఉద్దేశ్యంతోనే పార్టీలో ఉంటునే బ్రదర్స్ కంపుచేస్తున్నారు. తమమీద తమకు బాగా నమ్మకున్న కారణంగానే ముందు తమ్ముడు పార్టీ వదిలేశారు. ఇపుడు ఎన్నికలో ఓడిపోతే అప్పుడు తెలిసొస్తుంది తమ కెపాసిటి ఏమిటో ?
This post was last modified on October 25, 2022 11:32 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…