బహుశ.. టీడీపీ అదినేత చంద్రబాబు కూడా.. ఊహించి ఉండరు. ఆయన తాజాగా నిర్వహించిన పల్నాడు పర్యటన ఆసాంతం.. పూలవర్షం.. గజమాలలతో సత్కారాలు.. హార్షాతిరేకాలు.. యువత కేరింత.. మహిళలు హారతులతో ముందుకు సాగింది. జిల్లా ప్రజలు బాబుకు బ్రహ్మారథం పట్టారు. పల్నాడు పర్యటన విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాం నెలకొంది. పర్యటన ఆసాంతం యువకులు అధినేత వెంట పరుగులు తీశారు. దారి పొడవునా ఎక్కడికక్కడ చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో బాబు పర్యటన సాగింది.
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరీక్షించిన చంద్రబాబు రైతులను పరామర్శించి పాలకులపై ధ్వజమెత్తారు. పరిహారం అందేవరకు రైతుల పక్షాన పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. నరసరావుపేటలో పట్టణంలో గంటన్నర సేపు అట్టహాసంగా చంద్రబాబు రోడ్ షో సాగింది. పల్నాడు జిల్లాలో తిమ్మాపురం నుంచి గురజాల వరకు సాగిన చంద్రబాబు పర్యటనలో దారిపొడవునా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. తిమ్మాపురంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు పర్యటన రాత్రి 9 గంటలకు గురజాల చేరుకుంది. పట్టణాల్లో, గ్రామగ్రామాన ప్రజలు చంద్రబాబు కోసం గంటల సమయం నిరీక్షించారు.
తొలుత జాతీయ రహదారిపై గుంటూరు, చిలకలూరిపేట మధ్య తిమ్మాపురం జంక్షన్ వద్ద ఆయనకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గజమాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాదెండ్ల, తూబాడు మీదగా సాతులూరు వరకు సాగిన చంద్రబాబు పర్యటనలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా మహిళలు, రైతులు, టీడీపీ శ్రేణులు జేజేలు పలుకుతూ ముందుకు సాగారు. భారీ వర్షాలకు నాదెండ్ల, తుబాడు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. పత్తి, మిరప పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నాదెండ్లలో పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి హారతి ఇచ్చారు.
నాదెండ్ల గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు సుమారు గంట పాటు ప్రసగించారు. ఆ తర్వాత నరసరావుపేటలో చంద్రబాబు రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా జొన్నలగడ్డ వద్ద నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. మల్లమ్మ సెంటర్‌లో ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. పట్టణంలోని టీడీపీ డాక్టర్ సెల్ వైద్యులు పల్నాడు రోడ్డులో గజమాలతో చంద్రబాబును సత్కరించారు. పల్నాడు రోడ్డులో ఎన్టీఆర్ విగహ్రాల వద్ద, కాకతీయ నగర్ ప్రాంతాల్లో ప్రజలు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్ షోలో జనసేన జెండాలు కనిపించాయి. దీంతో అసలు .. చంద్రబాబు దీనిని ఊహించి ఉండరనే కామెంట్లు పార్టీలో వ్యక్తం అవుతుండడం గమనార్హం.
This post was last modified on October 20, 2022 11:28 am
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…