ఔను.. ఇక, ఏపీలో ఎవరితో కలిసి అడుగులు వేయాలి? అనే విషయాన్ని బీజేపీనే తేల్చుకోవాలి. ఇప్పటి వరకు జనసేనతో పొత్తు ఉందని.. ఆ పార్టీతో నే కలిసినడుస్తామని.. నిన్నటి వరకు చెప్పిన బీజేపీ.. పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయిపోయింది. ఎందుకంటే.. పవనే స్వయంగా చెప్పారు.. నేను అనేక సార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను. కానీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా వేచి చూస్తే.. మా పరిస్థితి ఇబ్బందుల్లో పడేలా ఉందని అన్నారు. అంతేకాదు.. ఇంకా వేచి చూసే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉరుములు లేని పిడుగులా.. వెళ్లి..టీడీపీ అదినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
అయితే.. తాను బేటీ అయింది ఎన్నికలకు సంబందించిన విషయంపై కాదని.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూస్తూ ఉండలేక.. సమైక్యంగా పోరాడాలనే ఉద్దేశంతోనేనని పవన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అందరూ కలిసి రావాలని.. కోరుతున్నానని చెప్పారు. వారు బీజేపీ అయినా..కమ్యూనిస్టులు అయినా.. వైసీపీయేతర ఏ పార్టీ అయినా.. కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. దీంతో బీజేపీ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎందుకంటే.. తాము పవన్‌తో పొత్తుతో ఉన్నామని.. చంద్రబాబుతోను.. టీడీపీతోను.. కలిసి పనిచేయాల్సిన అవసరం లేదనిచెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కు సంఘీభావం కూడా తెలిపారు.
అయితే.. అనూహ్యంగా పవన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు విషయంలో బీజేపీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేదనేది వాస్తవం. నిన్న మొన్నటి వరకు కూడా.. పార్టీని చంద్రబాబును కూడా వ్యతిరేకించారు. అయితే.. ఇప్పుడు తమకు ప్రధాన మద్దతు దారుగా ఉన్న పవనే వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత.. అనివార్య పరిస్థితి బీజేపీ ముందుకు వచ్చింది. 2014లో జరిగిన పొత్తుల మాదిరిగానే ఇప్పుడు కూడా.. చేతులు కలిపితేనే మంచిదని బీజేపీలోని ఓ వర్గం నాయకులు చెబుతున్నారు. అయితే.. సోము వీర్రాజు వంటి కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు మాత్రం టీడీపీతో తమకు పనిలేదని.. అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పోత్తుల బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టేశారు. మరి కమలనాథులు ఏం తేల్చుకుంటారో చూడాలి.
This post was last modified on October 18, 2022 9:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…