Political News

ఈ ఒక్క ఫొటో ఎంత‌గా వైర‌ల్ అయిందంటే!

వంద‌ల మాట‌ల్లో చెప్ప‌లేని.. భావాన్ని.. ఒక్క ఫొటో ప్ర‌తిబింబిస్తుందని అంటారు. ఇప్పుడు ఓ ఫొటో.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైర‌ల్ అవుతోంది. దాదాపు అంద‌రి సెల్ ఫోన్ల‌లోనూ.. క‌ద‌లాడుతోంది. అదే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు సంబంధించిన ఫొటో. వాస్త‌వానికి రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0 ను ప్రారంభించి 37 రోజులు అయింది. ఈ క్ర‌మంలో అనేక ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ, ఈ ఫొటో మాత్రం చాలా చాలా ప్ర‌త్యేకం. ఈ ఫొటో కేవ‌లం రాజ‌ధానిపై ఆకాంక్ష‌నే కాదు.. ఆలోచ‌న‌ను కూడా రేకెత్తిస్తోంది.

నిండి గ‌ర్భ‌వ‌తి అయిన మ‌హిళ‌.. ఒక చేతిలో రాజ‌ధాని రైతుల ఆకాంక్ష‌..రాష్ట్ర ఆకాంక్ష అయిన‌.. అమ‌రావ‌తికి చిహ్నంగా గ్రీన్ బెలూన్ల బొకేను ప‌ట్టుకుని.. అదే చేత్తో మంచినీళ్ల బాటిల్‌ను కూడా.. ప‌ట్టుకుని.. ఇంకో చేత్తో.. చిన్నారిని తీసుకుని పాద‌యాత్ర‌లో అడుగులు క‌దుపుతున్నారు. సాధార‌ణంగా రాజ‌ధాని కోసం.. ఎంద‌రో పాదం క‌దుపుతున్నారు. రాజ‌ధాని నినాదాన్ని ప‌లుకుతున్నారు. పాద‌యాత్ర‌కు వెళ్ల‌లేని వారు.. మ‌రో రూపంలో త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తు న్నారు. ఇంకొంద‌రు మాత్రం ఏం వెళ్తాంలే.. గురూ.. అని బ‌ద్ధ‌కిస్తున్నారు.

అయితే.. నిండు గ‌ర్భిణిగా ఉన్న ఈ మ‌హిళ మాత్రం పాద‌యాత్ర రివ్వున సాగిపోతున్నా… తాను కిలో మీట‌ర్ల దూరం వెనక‌బడిపోతున్నా.. మౌనంగా.. అడుగులో అడుగు వేస్తూ.. క‌డుపులో ఒక చిన్నారిని.. చేతిలో మ‌రో చిన్నారిని మోస్తూ.. రాజ‌ధాని ఆకాంక్ష‌ను వెల్ల‌డిస్తున్న తీరు అంద‌రినీ అబ్బుర ప‌రుస్తోంది. రాజ‌ధాని సంక‌ల్పం.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చూడాల‌నే సంక‌ల్పం.. ఆమెలో న‌ర‌న‌రానా జీర్ణించుకుపోయిన‌.. తీరు.. ప్ర‌తి ఒక్క‌రినీ మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తోంది. మ‌రి.. ఈ ఫొటో చూసిన త‌ర్వాత‌.. మ‌నం మాత్రం జైకొట్ట‌కుండా.. ఉండ‌గ‌లా.. పాదం క‌ద‌ప‌కుండా.. నిరీక్షించ‌గ‌లమా!!

This post was last modified on October 18, 2022 3:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి షోలు…100 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

16 minutes ago

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…

39 minutes ago

‘అఖండ’మైన నిర్ణయం తీసుకునే టైమొచ్చింది

అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…

1 hour ago

ఇండిగో: టికెట్ డబ్బులిస్తే సరిపోతుందా?

దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…

1 hour ago

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

3 hours ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

4 hours ago