మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్పటికి నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికైనా.. కేసును పరిష్కరించి.. తమకు న్యాయం చేయాలని బాధిత వివేకా కుటుంబం కోరుకుంటోంది. అయితే.. పొలీసులు మాత్రం పైకి ఒకవిధంగా.. లోలోన మరో విధంగా వ్యవహరిస్తున్నారని.. సీబీఐ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నిందితులతో పోలీసులు చేతులు కలిపారని.. నిందితులతో పోలీసులు చేతులు కలిపారని కూడా సీబీఐ నేరుగా సుప్రీం కోర్టులోనే పేర్కొనడం సంచలనంగా మారింది.
వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో.. నిందితుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరారు. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూశారని సీబీఐ వాదించింది.
సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ ధర్మాసనం ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 14కి వాయిదా వేసింది. ఇక, ఇప్పటికే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. వివేకా కేసులో ఆది నుంచి అప్రూవర్‌గామారిన దస్తగిరి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైగా.. ఇదే విషయంపై ఎస్పీకి సైతం.. ఆయన ఫిర్యాదు చేశారు. అయినా.. ఎవరూ కూడా.. ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడు సీబీఐ నేరుగా.. గంగిరెడ్డి వంటివారిపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా.. రక్షణ కలుతుందా.. లేదా చూడాలి.
This post was last modified on October 17, 2022 4:55 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…