పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు.
రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు అందుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ధిక్కారస్వరం వినిపిస్తున్న సొంత ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకుముందు మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌లు కూడా వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.
నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు… రఘురామపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా తనపై చర్యలు తీసుకోలేనివిధంగా పక్కా ప్లాన్‌తో పావులు కదిపిన రఘురామతో జగన్ ఇప్పుడు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన విమర్శలు గుప్పించిన నరసాపురం లోకసభ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేసులు పెట్టిస్తుండటం గమనార్హం.
గతంలో వదిలేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక అధిష్టానం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదివరకే వైసీపీ ఎంపీలు.. రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఫిర్యాదు వెళ్లింది.
This post was last modified on July 9, 2020 6:08 pm
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…