Political News

తెలంగాణలో ఎప్పటికి లాక్ డౌన్ ఉండనట్లే.. !

పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు నమోదయ్యే వందలు కాస్తా పదిహేనువందలకు చేరుకున్నపరిస్థితి. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ పుణ్యమా అని.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వీయ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పలు వాణిజ్య సంస్థలు తమకు తాముగా స్వీయ నియంత్రణ విధించుకొని షాపుల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతుందన్న వాదన జోరుగా వినిపించింది.

అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ.. తెలంగాణలో అందునా హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదన్న విషయం కాస్త ఆలస్యంగా అర్థమైంది. ఎందుకిలా? కేసులు పెరిగిపోతున్న వేళ.. వాటిని నియంత్రించాల్సింది పోయి.. లాక్ డౌన్ ఎందుకు విధించటం లేదన్నది ప్రశ్నగా మారింది. ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీకి చెందిన వారెవరూ దీనికి సూటిగా సమాధానం చెప్పింది లేదు.

ఇలాంటివేళ.. మంత్రి కేటీఆర్ అన్యాపదేశంగా హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎందుకు విధించటం లేదన్న విషయంపై క్లారిటీ ఇచచేశారు. గణాంకాల్ని గమ్మత్తుగా చెప్పేసిన కేటీఆర్.. జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణలో మరణాలు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మూడు శాతం మరణాల రేటు ఉంటే.. తెలంగాణలో మాత్రం రెండు శాతమే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యలతోనే అది సాధ్యమైందనన ఆయన.. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ వచ్చే వరకూ లాక్ డౌన్ విధించి ఇళ్లల్లోనే ఉంచలేని పరిస్థితి ఉందన్న మంత్రి కేటీఆర్.. వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలీదు కానీ.. ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలీని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తు ప్రజలు ఉపాధి కోల్పోతారని చెప్పారు. అందుకే.. అందరికి జీవితం.. జీవనోపాధి చాలా ముఖ్యమని.. కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి.. డెవలప్ మెంట్ సాధించాలన్నారు. ఈ మాటల్ని చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా లాక్ డౌన్ విధించే అవకాశం లేదన్న విషయం మంత్రి కేటీఆర్ మాటలతో స్పష్టమైందని చెప్పక తప్పదు.

This post was last modified on July 9, 2020 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

2 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

3 hours ago

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల…

3 hours ago

కొడాలి నానికి అందరూ దూరమవుతున్నారు

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్‌.. కొడాలి నానికి రాజ‌కీయంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో గట్టి ప‌ట్టుంది. ఆయ‌న వ‌రుస విజ‌యాలు…

3 hours ago

మొత్తానికి పాక్ చెర నుంచి విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్

పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…

4 hours ago

కింగ్ డమ్ ఫిక్స్ – తమ్ముడు తప్పుకున్నట్టేనా

మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…

4 hours ago