కరోనాపై పోరులో మొదట బాగా విమర్శలు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయన్ని పొగుడుతున్నాయి. తన తప్పులను దిద్దుకున్న జగన్.. ఇప్పుడు కరోనాపై పోరులో సమర్థంగా పని చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయన ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరైన జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆయన్ని అభినందించక తప్పని పరిస్థితి వచ్చింది.
ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రవేశపెట్టడం ద్వారా నేషనల్ మీడియాలో సైతం జగన్ గురించి పాజిటివ్ న్యూస్‌లు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ట్విట్టర్ వేదికపై జగన్‌పై ప్రశంసలు కురిపించడం విశేషం.
తమ రాష్ట్రంలో పరిస్థితులను.. ఏపీతో పోలుస్తూ జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు సిద్ధరామయ్య. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య కన్నడ భాషలో ట్వీట్ చేశారు.
ఒక మాజీ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇలా జగన్ మీద ప్రశంసలు కురిపించడంతో వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. దటీజ్ జగన్ అంటూ కొనియాడుతున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా జగన్ సర్కారు ఇటీవలే ఒకేసారి 1086 అంబులెన్సులు (108, 104) ప్రారంభించడంతో పాటు గుంటూరులో ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తెచ్చింది.
This post was last modified on July 7, 2020 5:10 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…