ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పడుకోబెట్టిన కరోనా తాజాగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కూడా సోకింది. ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయనడానికి చిహ్నంగా పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు.
కరోనా సోకినా అంజాద్ బాషా కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హొం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంజాద్ భాషా కడప ఎమ్మెల్యే. రేపు వైఎస్ జయంతి సందర్భంగా కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందు అంజాద్ కు కరోనా రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇదే వార్త రేపు బయటకు వచ్చింటే సీఎంకు కరోనా ప్రమాదం ఉండేదని… అదృష్టవశాత్తూ ఒక రోజు ముందుగా ఆయన కు టెస్టులు చేయడం మంచిదయ్యిందని అంటున్నారు.
హోంక్వారంటైన్ నేపథ్యంలో అంజాద్ భాషా లేకుండానే రేపు జగన్ పర్యటన జరగనుంది.మరో 28 రోజుల పాటు ఆయన గృహ నిర్బందంలోనే ఉంటారు. ఆయనకు ఇంకోసారి పరీక్షలు చేయనున్నారు. ఇంతకీ ఎలా బయటపడిందంటే.. సీఎం పర్యటన నేపథ్యంలో అందులో పాల్గొనబోయే ప్రజాప్రతినిధులకు, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు అధికారులు. టెస్టులు నెగెటివ్ వచ్చిన వారినే ఈ పర్యటనలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.
This post was last modified on July 7, 2020 4:56 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…