వైఎస్సార్ జయంతికి వైఎస్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇపుడుపుపాయలకు చేరుకుని తండ్రి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించడం ఆనవాయితీ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రెండో జయంతి కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి ఇడుపుల పాయకు హెలికాప్టర్ లో వెళ్తారు. అక్కడ కుటుంబ అతిథి గృహంలో ఉంటారు.
అయితే, కోవిడ్ నేపథ్యంలో సీఎం జగన్ తొలి లాంగ్ టూర్ ఇదే. కడపకు ఎపుడు వెళ్లినా రెండు రోజులు ఉండే జగన్ ఈసారి కార్యక్రమం అనంతరం వెంటనే వెనుదిరగనున్నారు. కోవిడ్ భయమే దీనికి కారణం. ఎందుకంటే కడపలో ఉంటే నేతల తాకిడి ఉంటుంది. అందుకే ఈసారి ఆ హడావుడి ఏమీ పెట్టుకోవడం లేదు.
అంతేకాదు, కోవిడ్–19 వ్యాప్తి నేపత్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటిస్తున్నారు. పర్యటనలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కోవిడ్–19 త్రోట్ స్వాబ్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే అనుమతిస్తారు. సాధారణ జనం తాకిడి ఈసారి ఉండదు. అంతేకాదు, ట్రిపుల్ ఐటీలో పలు కార్యక్రమాలున్న నేపథ్యంలో బయటనుండి వచ్చిన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ముందురోజు అంటే మంగళవారం నిర్ణయించిన వారికే అనుమతి. స్టాఫ్, స్టూడెంట్స్ తప్ప అక్కడ కూడా ఎవరినీ అనుమతించరు. వీరన్నగట్టుపల్లె క్రాస్ నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అన్ని చోట్ల చెక్ చేసి పంపిస్తారు.
జగన్ టూర్ షెడ్యూల్ హైలెట్స్
This post was last modified on July 7, 2020 5:16 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…